జాతీయ వాద జర్నలిస్టు లకు ఐక్యం చేస్తున్న డబ్యూ జె ఐ
జాతీయ వాద జర్నలిస్టులను ఐక్యం చేస్తున్న డబ్ల్యుజెఐ
విశ్వావసు నామ సంవత్సర పంచాంగం ఆవిష్కరణలో
కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్
కరీంనగర్,మార్చి,30
జాతీయ భావాలు కలిగిన జర్నలిస్టులను ఐక్యం చేసే ఉద్దేశంతో ఏర్పాటై, దేశవ్యాప్తంగా కార్యకలాపాలు కొనసాగిస్తున్న
వర్కింగ్ జర్నలిస్ట్ ఆఫ్ ఇండియా
తెలంగాణ శాఖ విశ్వావసు నామ సంవత్సర పంచాంగాన్ని వెలువరించడం అభినందనీయమని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు.
స్థానిక చైతన్యపురి లోని మహాశక్తి ఆలయంలో ఆదివారం సాయంత్రం డబ్ల్యూజేఐ ఉగాది పంచాంగాన్ని ఆయన ఆవిష్కరించారు.
యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తాడూరు కరుణాకర్, కార్యదర్శి శివనాద్రి ప్రమోద్ కుమార్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు టి సత్యనారాయణ, సభ్యులు డిఎస్ ప్రసాద్, గంగం రాజు, కస్తూరి ప్రభాకర్, ఎస్ మహేష్, ఆడెపు లక్ష్మీనారాయణ, శ్రీనివాసరావు జాదవ్, శరత్ కుమార్ రావు,
ఠాకూర్ సంతోష్ సింగ్, రవీందర్ రెడ్డి, నార్సని కేదారి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతన తెలుగు సంవత్సరం జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి నాంది
పడాలని, వారి జీవితాల్లో వెలుగులు ప్రసాదించాలని
ఆకాంక్షించారు.
రాష్ట్రంలోని జర్నలిస్టులందరికీ
విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. వర్కింగ్ జర్నలిస్ట్ ఆఫ్ ఇండియా జాతీయ భావజాలంతో, దేశవ్యాప్తంగా 16 రాష్ట్రాలలో జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం
నిరంతర పోరాటాలు చేస్తున్నదని గుర్తు చేశారు.
డబ్ల్యూజేఐ తెలంగాణ శాఖ
రాష్ట్రంలో చేపట్టిన విస్తరణ కార్యక్రమాలు, జర్నలిస్టు సమాజం నుండి వస్తున్న
ఆదరణ అంశాలను యూనియన్ నేతలు ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. ఓవైపు జర్నలిస్టుల సంక్షేమం కోసం కృషి చేస్తూనే, మరోవైపు సంఘం ఆధ్వర్యంలో ప్రజాహిత, ప్రజా చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నామని తెలిపారు.
తెలంగాణలో పటిష్టమైన జర్నలిస్టు సంఘంగా ఎదగడానికి
కార్యాచరణ సిద్ధం చేశామని, త్వరలోనే గ్రామీణ జర్నలిస్టుల ప్రతిభను వెలికి తీసేందుకు
రాష్ట్రస్థాయి గ్రామీణ జర్నలిస్టుల పురస్కారాల ప్రధానోత్సవ కార్యక్రమం చేపట్టినట్లు వివరించారు.