సత్వర, నమ్మకమైన బ్యాంకింగ్ సేవలే తమ లక్ష్యం. గాయత్రి బ్యాంక్ సిఈఒ వనమాల శ్రీనివాస్.
సత్వర, నమ్మకమైన బ్యాంకింగ్ సేవలే తమ లక్ష్యం.
గాయత్రి బ్యాంక్ సిఈఒ వనమాల శ్రీనివాస్.
చురకలు ప్రతినిధి, జగిత్యాల, మార్చి 29 : సత్వర, నమ్మకమైన బ్యాంకింగ్ సేవలే తమ లక్ష్యమని గాయత్రి బ్యాంక్ సిఈఒ వనమాల శ్రీనివాస్ అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని గాయత్రి కో ఆపరేటివ్ అర్బన్ బ్యాంకు ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిఈవో వనమాల శ్రీనివాస్ మాట్లాడుతూ
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో మరో 15 నూతన బ్రాంచీలను ఏర్పాటు చేయబోతున్నామని తెలియజేయుటకు సంతోషిస్తున్నామని తెలిపారు. అందరి ఆదరాభిమానాలతో, 11-09-2000 రోజున జగిత్యాల కేంద్రంగా ప్రారంభించబడిన ది గాయత్రి కో ఆపరేటివ్ బ్యాంకు, నేటికి రూ.1779. 15 కోట్ల డిపాజిట్లు, రూ. 1339.55 కోట్ల ఋణనిలువ కలిగి రూ. 3118.70 కోట్ల వ్యాపారాన్ని సాధించి 7,88,304 మంది ఖతాదారుల మన్ననలతో, మల్టిస్ట్రేట్ కో ఆపరేటివ్ బ్యాంకుగా, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో 62 బ్రాంచీలతో సేవలందిస్తున్నామన్నారు.
గత 24 సంవత్సరాలుగా, గాయత్రి బ్యాంకు సత్వర, నమ్మకమైన బ్యాంకింగ్ సేవలు అందించడమే లక్ష్యంగా, ప్రజల ఆదరాభిమానాలతో దినదినాభివృద్ధిచెందుతూ తెలంగాణ రాష్ట్రంలో మొదటి స్థానానికి చేరుకోగలిగామన్నారు. ఈ ఆర్థికసంవత్సరంలో ఇప్పటి వరకు 26 నూతన బ్రాంచీలను ప్రారంభించుకొని, మరో 6 బ్రాంచీలను కలిగియున్న యాదగిరి లక్ష్మి నరసింహస్వామి బ్యాంకును విలీనం చేసుకోవడం ద్వారా మొత్తం 62 బ్రాంచీలను కలిగి ఉండగా మరో 4 బ్రాంచీలు ఎప్రిల్, మే మాసంలలో ప్రారంభించుటకు ఏర్పాట్లు చేస్తున్నామని, తద్వారా 66 బ్రాంచీలతో, సమగ్ర పర్యవేక్షణ కోసం 5 రీజియన్లుగా విభజించి వాటికి అనుభవం గల అధికారులను రీజియన్ మేనేజర్ లుగా నియమించడం జరిగిందన్నారు. రాబోవు ఆర్థిక సంవత్సరం అనగా 2025-26 ఆర్ధిక సంవత్సరానికి గాను భారతీయ రిజర్వ్ బ్యాంకు వారు నూతనంగా మరో 15 బ్రాంచీలను ఏర్పాటుచేయుటకు అనుమతించడం జరిగిందని, ఈ 15 బ్రాంచీలను 2026 మొదటి అర్ధవార్షికంలోగా ప్రారంభించుటకు మేనేజ్మెంట్ కృతనిశ్చయంతో ఉందని, తద్వారా రెండు తెలుగు రాష్ట్రాలలో కలిపి మొత్తం 81 బ్రాంచీలతో బ్యాంకింగ్ సేవలను అందించబోతున్నందుకు సంతోషిస్తున్నామన్నారు. ఈ బ్రాంచీల నెట్వర్క్ దక్షిణ భారతదేశంలోని కో-ఆపరేటివ్ బ్యాంకులలో అత్యధిక బ్రాంచీల నెట్వర్క్ మొదటి స్థానంలో నిలిచామని, 2025-26 ఆర్థిక సంవత్సరానికి అనుమతించబడిన నూతన బ్రాంచీల వివరాలు తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాల జిల్లాలో కొడిమ్యాల, నిజామాబాద్ జిల్లాలో బోధన్, మోర్తాడ్, హన్మకొండ జిల్లా లోపరకాల, వరంగల్ జిల్లాలో నర్సంపేట్,
ఖమ్మం జిల్లాలో సత్తుపల్లి, మధిర, వైరా, నల్గొండ జిల్లాలో నల్గొండ, మిర్యాలగూడ,
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లాలో మంగళగిరి, తెనాలి, పొన్నూరు, పల్నాడు జిల్లాలో సత్తెనపల్లి, పిడుగురాళ్ళ
మొత్తం 15 బ్రాంచీలలో 10 బ్రాంచీలు తెలంగాణాలో, 5 బ్రాంచీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలలో ఏర్పాటు చేయబోతున్నామన్నారు. ఈ 81 బ్రాంచీలను క్షేత్రస్థాయిలో సమన్వయం చేయడానికిగాను మరో రెండు రీజియన్లను ఏర్పాటు చేయాలని యోచిస్తున్నామని, అలాగే సూక్ష్మ పర్యవేక్షణ కోసం హెడ్ ఆఫీస్ యందు అయిదు డిపార్ట్మెంట్లను ఏర్పాటుచేసుకొని, అనుభవం గల అధికారులను నియమించుకోవడం జరిగిందన్నారు. అలాగే ఎప్పటికప్పుడు అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటూ రాష్ట్రంలోని సహకార అర్బన్ బ్యాంకింగ్ వ్వవస్థలోనే ప్రప్రధమంగా పూర్తిస్థాయులో ఏఈపిఎస్, మొబైల్ బ్యాకింగ్, ఐఎంపిఎస్, యూపీఐ సేవలను, ఆర్టీజిఎస్ /నెఫ్ట్ , ఎటిఎం , ఏపీబిఎస్, సీటిఎస్, క్లియరింగ్ , ఏసిహెచ్,డెబిట్ , ఏసిహెచ్ క్రెడిట్ , ఈబీటీ , ఈసిఎస్, మైక్రో ఎటిఎం , సేవలను వినియోగదారులకు అందిస్తున్నామన్నారు.
2000 ఏడాదిలో ప్రారంబించబడిన గాయత్రి బ్యాంకు 2025 వ సంవత్సరంతో 25 సంవత్సరాలతో సిల్వర్ జూబ్లీ సంవత్సరాన్ని నిర్వహించుకోవడం జరుగుతుందని, ఈ సందర్భంగా 444 రోజులకు 8.80శాతం వడ్డీతో, సిల్వర్ జూబ్లీ ప్రత్యేక డిపాజిట్ పథకమును తేదీ: 17-09-2024 న ప్రవేశ పెట్టడం జరిగిందన్నారు. ఇప్పటివరకు ఈ పథకం క్రింద రూ. 143 కోట్ల 78 లక్షల డిపాజిట్లను సేకరించడం జరిగిందన్నారు.
అన్ని శాఖల క్రింద 338 బ్యాంకింగ్ కరస్పాండెంట్ లను నియమించి ఏఈపిఎస్, మైక్రో ఎటిఎం , ఐఎంపిఎస్ , వంటి సేవలను వినియోగదారుల చెంతకు అందిస్తున్నామని, అలాగే త్వరలో ఇంటర్నెట్ బ్యాంకింగ్, డైరెక్ట్ ఆర్.టి.జి.ఎస్ వంటి సేవలను ప్రారంబించబోతున్నామన్నారు
. బ్రాంచీల విస్తరణతో పాటుగా 2026 మార్చి నాటికి 10 లక్షల క్లైంటేల్ బేస్ ను సాధించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని, ఈ అభివృద్ధికి కారణమైన 7 లక్షల 88 వేల మంది వినియోగదారులకు, భారతీయ రిజర్వు బ్యాంకు అధికారులకు, సహకార అధికారులకు, శ్రేయోభిలాశులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు.
బ్యాంకు ఆవరణలో జరిగిన ఈ కార్యక్రమంలో బ్యాంకు ముఖ్యకార్యనిర్వహణాధికారి వనమాల శ్రీనివాస్, జనరల్ మేనేజర్ రామ్ సత్యనారాయణ, జనరల్ మేనేజర్ శ్రీలత, డిప్యూటీ జనరల్ మేనేజర్ సి.హెచ్. కృష్ణా రెడ్డి , బ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు.