గంజాయి విక్రయిస్తున్న యువకుడి అరెస్టు. 300 గ్రాముల గంజాయి, బైక్ స్వాధీనం. వివరాలు వెల్లడించిన మెట్ పల్లి సీఐ నిరంజన్ రెడ్డి
గంజాయి విక్రయిస్తున్న యువకుడి అరెస్టు.
300 గ్రాముల గంజాయి, బైక్ స్వాధీనం.
వివరాలు వెల్లడించిన మెట్ పల్లి సీఐ నిరంజన్ రెడ్డి
చురకలు విలేకరి, మెట్ పల్లి, మార్చి 22 : గంజాయి విక్రయిస్తున్న యువకుడి అదుపులోకి తీసుకొని రిమాండ్కు తరలించినట్లు మెట్ పల్లి సీఐ నిరంజన్ రెడ్డి తెలిపారు. శనివారం మెట్ పల్లి పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలోని మేడిపల్లి గ్రామ శివారులో ఇబ్రహీంపట్నం ఎస్ఐ అనిల్ తమ సిబ్బందితో కలసి వాహనాల తనిఖీలు చేస్తున్న క్రమంలో పోలీసులను చూసి ఓ యువకుడు పారిపోవడానికి ప్రయత్నించగా అతనిని పట్టుకొని విచారించామన్నారు. నిందితుని వద్ద 300 గ్రాముల గంజాయి, ఒ బైక్, ఒ సెల్ఫోన్ స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. నిందితుడైన పోగుల అజయ్ కోరుట్ల పట్టణానికి చెందిన వాడని, మహారాష్ట్రలోని నాందేడ్కు వెళ్లి అక్కడి నుండి తక్కువ ధరకు గంజాయి తీసుకవచ్చి కోరుట్ల, మెట్పల్లి పరిసరా ప్రాంతాల్లో చిన్న చిన్ని ప్యాకెట్లలో అధిక ధరకు విక్రయిస్తున్నట్లు తెలిపారు.
నిందితునిపై గతంలో కోరుట్ల పోలీస్ స్టేషన్లో ఓ గంజాయి కేసు నమోదైందని, ఇతర రెండు కేసుల్లో జైలుకు వెళ్లినట్లు తెలిపారు. ఈ కేసులో మరో నిందితుడు పరారీలో ఉన్నాడని, పోగుల అజయ్ను రిమాండ్కు తరలించినట్లు తెలిపారు. ఈ సమావేశంలో ఇబ్రహీంపట్నం ఎస్ఐ అనిల్, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.