అత్యుత్తమ సాంకేతికతతో వినియోగదారులకు సేవలు. టీజీ ఎన్పిడిసిఎల్ ఎస్ఈ సాలియా నాయక్.
అత్యుత్తమ సాంకేతికతతో వినియోగదారులకు సేవలు.
చురకలు ప్రతినిధి, జగిత్యాల, మార్చి 15: వినియోగదారులకు అత్యుత్తమ సేవలు అందించడానికి సాంకేతికతను అందిపుచ్చుకుని, దానికి అనుగుణంగా మరింత మెరుగైన , నాణ్యమైన విద్యుత్ సరఫరా అందిస్తున్నామని జగిత్యాల సర్కిల్ సూపరిండెంట్ ఇంజనీర్ సాలియా నాయక్ అన్నారు. శనివారం ఆయన మాట్లాడుతూ అసెట్ మ్యాపింగ్ ట్రాకింగ్ లో అన్ని 33కేవీ, 11కేవీ స్తంభాలకు యూనిక్ పోల్ నెంబర్ పెయింటింగ్ ప్రక్రియను చేపట్టామని, ఇప్పటి వరకు 33 కెవి పోల్ నంబరింగ్ 41 ఫీడర్స్ పూర్తి అయ్యాయని, 11 కెవి పోల్ నంబరింగ్ 61 ఫీడర్స్ పూర్తి చేశామని తెలిపారు. ఎక్కడైనా సమస్య ఉత్పన్నమైతే వెంటనే ఆ పోల్ నెంబర్ ద్వారా అక్కడి లొకేషన్ మ్యాపింగ్ తెలుసుకొని వెంటనే అక్కడికి వెళ్లి సమస్యను త్వరిత గతిన పరిష్కరించవచ్చనన్నారు. దీని ద్వారా అంతరాయాల సమయాన్ని గణనీయంగా తగ్గించవచ్చని తెలిపారు. యూనిక్ పోల్ నంబరింగ్ వలన 33కేవీ,11కేవీ విద్యుత్ లైన్ల క్రమబద్ద నిర్వహణ, యూనిక్ పోల్ నంబర్లను ఉపయోగించి విద్యుత్ లైన్లు క్రమబద్ధంగా సిబ్బంది పరంగా విభజించి, దశల వారీగా నిర్వహణ చేపట్టి వివరాలు నమోదు ప్రక్రియ సులభతరంగా చేపట్టవచ్చన్నారు. విద్యుత్ అంతరాయాలు గణనీయంగా తగ్గించడంలో యూనిక్ పోల్ నంబరింగ్ కీలక పాత్ర పోషిస్తుందన్నారు.
వినియోగదారులకు మరింత నాణ్యమైన, మెరుగైన విద్యుత్ సరఫరా అందించడానికి ఎప్పటికప్పుడు నూతన సాంకేతికతను అందిపుచ్చుకొని అందుకు అనుగుణంగా అభివృద్ధిలో ముందుకు వెళ్తున్నామన్నారు.