*విద్యుత్ సమస్యల పరిష్కారం కొరకే విద్యుత్ కన్జ్యూమర్ ఫోరం..*. *-ఎరుకల నారాయణ సి.జి.ఆర్.ఎఫ్ ll, చైర్పర్సన్ టి.జీ. ఎన్పీడీసీఎల్.*

విద్యుత్ సమస్యల పరిష్కారం కొరకే విద్యుత్ కన్జ్యూమర్ ఫోరం..
*-ఎరుకల నారాయణ సి.జి.ఆర్.ఎఫ్ ll, చైర్పర్సన్ టి.జీ. ఎన్పీడీసీఎల్.*
*జగిత్యాల మార్చి 22 :* పట్టణంలోని సబ్ డివిజన్ కార్యాలయం ఆవరణలో విద్యుత్ సమస్యల పరిష్కార వేదిక శనివారం ఉదయం 10.30 గంటలకు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా ఎరుకల నారాయణ సి.జి. ఆర్.ఎఫ్ ll, చైర్పర్సన్ టిజి. ఎన్పీడీసీఎల్. పాల్గొన్ని మాట్లాడుతూ విద్యుత్ వినియోదారుల సమస్యలపై అడిగి తెలుసుకున్నారు. రైతులు ప్రతి ఒక్కరు కూడా మోటార్లకు కెపాసిటర్ను అమర్చుకోవాలని దాని వల్ల ఎన్నో లాభాలు ఉంటాయని, రైతులకు ఏదైనా విద్యుత్ సమస్యలు గాని ఉంటే వెంటనే విద్యుత్ కన్జ్యూమర్ ఫోరం కు తెలియజేస్తే సమస్యలను వెంటనే పరిష్కరిస్తామని తెలిపారు.
విద్యుత్ సరఫరాలో ఎలాంటి సేవాలోపం ఉన్న ఫోరమునకు ఫిర్యాదు చేయవచ్చునని. మీ ఫిర్యాదును వ్రాత పూర్వకముగా సర్వీసు కనెక్షన్ నెంబర్ మరియు మీ యొక్క పూర్తి చిరునామాతో పోస్టు ద్వారా గాని, మెయిల్ ద్వారా గాని, వ్యక్తిగతంగా గాని, "వాట్సాప్" కు గాని, పై ఆఫీసుకు పంపాలని. ఫిర్యాదు చేయడానికై ఎలాంటి రుసుములు చెల్లించనక్కరలేదని. ఫిర్యాదు చేయుటకు వకీలు (అడ్వకేటు)ను కూడా పెట్టవలసిన అవసరము లేదని అన్నారు. ఫిర్యాదుదారుల నుంచి మరింత వివరములు తెలుసుకొనుటకు అవసరమైన యెడల ఫోరం సభ్యులు మీ వద్దకే వచ్చి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని తెలిపారు.
ఈకార్యక్రమంలో ఫోరం సభ్యులు సలంద్ర రామకృష్ణ, లకావత్ కిషన్, మర్రిపల్లి రాజ గౌడ్, జగిత్యాల ఎస్సీ. సలియా నాయక్, ఎడీఈ. జవహర్ లాల్ నాయక్, ఏఈలు, విద్యుత్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.