*నేరాలను నియంత్రించేందుకు, పరిశోధనలో సాంకేతిక పరిజ్ఙానం ని ఉపయోగించాలి. జిల్లా ఎస్పి అశోక్ కుమార్
నేరాలను నియంత్రించేందుకు, పరిశోధనలో సాంకేతిక పరిజ్ఙానం ని ఉపయోగించాలి.
*- - -శ్రీరామనవమి ,హనుమాన్ జయంతి ఉత్సవాలు ప్రశాంతంగా జరిగేలా భద్రత ఏర్పాట్లు చేయాలి*
*- - - విది నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన అదికారులకు, సిబ్బందికి ప్రశంస ప్రోత్సాహకాలు.*
*- - - జిల్లా ఎస్పి అశోక్ కుమార్ ఐపిఎస్
చురకలు విలేఖరి
జగిత్యాల, ఏప్రిల్, 03
సమస్యలను క్షేత్ర స్థాయిలో గుర్తించి ప్రజలకు సమర్థవంతమైన సేవలు అందించే విధంగా పోలీస్ అధికారులు, సిబ్బంది కృషి చేయాలని జిల్లా ఎస్పీ అశోక్ సూచించారు. ఈరోజు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో నెలవారి క్రైమ్ మీటింగ్ సమావేశాన్ని నిర్వహించారు. గత నెలలో జరిగిన నేరాలపై చర్చించి పెండింగ్ కేసులను త్వరితంగా పరిష్కరిస్తూ పెండింగ్ కేసుల సంఖ్య తగ్గించడానికి చర్యలు తీసుకోవాలన్నారు.కొత్త కేసులతో పాటు చాలా కాలంగా పెండింగ్ కేసులను ఎప్పటికప్పుడు సమీక్షించడం ద్వారా కేసుల సంఖ్య తగ్గించే దిశగా అన్ని స్థాయిల అధికారులు పని చేయాలన్నారు. నేర నియంత్రణలో బాగంగా సొసైటీ పర్ పబ్లిక్ సేఫ్టీ లో బాగంగా ప్రతి పట్టణంలోని కాలనీల్లో,గ్రామాలలో, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకునేల ప్రజలకు, వ్యాపారులకు అవగాహన కల్పించాలన్నారు. ప్రమాదాల నివారణ కొరకు రోడ్డు భద్రతపై అవగాహన సమావేశాలు నిర్వహించాలని అన్నారు.దొంగతనాలు జరగకుండా రాత్రి పూట గస్తి బీట్‌లు, పెట్రోలింగ్ నిర్వహించాలని, జిల్లాల, రాష్ట్ర సరిహద్దుల నుండి వచ్చే గంజాయి సరఫరా చేసే మూలాలను, కీలక వ్యక్తులను గుర్తించి వారిపై కేసులు నమోదు చేసి రవాణా ను పకడ్బందీగా నియంత్రించాలన్నారు. విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన పోలీస్ అధికారులను మరియు సిబ్బందిని జిల్లా ఎస్పీ గారు ప్రత్యేకంగా అభినందించి ప్రశంసా పత్రాలు అందజేశారు.
*హనుమాన్ జయంతి ఉత్సవాలు,శ్రీరామనవమి ప్రశాంతంగా జరిగేలా భద్రత ఏర్పాట్లు చేయాలి*
గత నెలలో జరిగిన మహాశివరాత్రి, ధర్మపురి బ్రహ్మోత్సవాలు, పెద్దపూర్ జాతర, రంజాన్ పండగలకు సంబంధించిన వేడుకలు జిల్లాలో ప్రశాంతంగా జరగడానికి పోలీసు అధికారులు, సిబ్బంది కృషి అభినందనీయమని అన్నారు ఇది స్ఫూర్తితో రానున్న రోజుల్లో జరిగే శ్రీరామనవమి,హనుమాన్ జయంతి ఉత్సవాలు వేడుకలను ప్రజలు శాంతియుతంగా, ప్రణాళిక ప్రకారం జరగాలని, ఎక్కడ ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా చూడాలని అధికారులకు సూచించారు. వేడుకల్లో ఎక్కడా శాంతిభద్రతల సమస్య రానివ్వవద్దని, ఈ విషయంలో అందరూ సమిష్టిగా కృషి చేయాలన్నారు.
అనంతరం పోలీసు వాహనాలను ఇన్స్పెక్షన్ చేస్తూ, యస్.హెచ్.ఓ వెహికిల్ నుండి బ్ల్యూకోర్ట్ బైక్స్ వరకు ప్రతి వెహికిల్ పూర్తి స్థాయిలో కండిషన్ లో ఉండాలని, యస్.హెచ్.ఓ. లకు సూచించారు. వెహికిల్ నియమించబడిన డ్రైవర్స్ వెహికిల్ క్లీన్ గా ఉండేలా చూసుకోవాలని అన్నారు.
ఈ యొక్క కార్యక్రమo లో అదనపు ఎస్పి భీమ్ రావు, డిఎస్పి లు రఘు చంధర్, రాముల, రంగా రెడ్డి, మరియు డీసీర్బ్,
,ఎస్బి, సిసిఎస్,
ఐటి కోర్ ఇన్స్పెక్టర్ లు శ్రీనివాస్,ఆరిఫ్అలీఖాన్, శ్రీనివాస్, రిజర్వ్ ఇన్స్పెక్టర్ కిరణ్ కుమార్ మరియు సి.ఐ లు ఎస్.ఐ లు పాల్గొన్నారు.