పదవీ విరమణ పొందిన పోలీస్ అధికారుల సేవలు స్ఫూర్తివంతం. జిల్లా అదనపు ఎస్పీ భీమ్ రావు.

పదవీ విరమణ పొందిన పోలీస్ అధికారుల సేవలు స్ఫూర్తివంతం.  జిల్లా అదనపు ఎస్పీ భీమ్ రావు.

పదవీ విరమణ పొందిన పోలీస్ అధికారుల సేవలు స్ఫూర్తివంతం.

జిల్లా అదనపు ఎస్పీ భీమ్ రావు.

చురకలు ప్రతినిధి, జగిత్యాల, మార్చి 29: పదవీ విరమణ పొందిన పోలీస్ అధికారుల సేవలు స్ఫూర్తివంతమని జగిత్యాల జిల్లా అదనపు ఎస్పీ భీమ్ రావు అన్నారు. విధి నిర్వహణలో అందరి మన్ననలు అందుకొని పదవీ విరమణ పొందిన ఎస్.ఐ మన్సూర్  ఖాన్, హెడ్ కానిస్టేబుల్ గంగరాజంలను శాలువా,పులమాలలతో ఘనంగా సన్మానించి జ్ఞాపికను అందజేశారు. శనివారం జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో జరిగిన పదవీ విరమణ కార్యక్రమంలో  ముఖ్య అతిథిగా పాల్గొన అదనపు ఎస్పీ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ ఎన్నో రకాల త్యాగాలతో పాటు కుటుంబాలకు దూరంగా ఉంటూ ప్రజలకు సేవలందించడం ఎంతో గర్వకారణమన్నారు.  ప్రతి ఉద్యోగి జీవితంలో పదవీ విరమణ తప్పదని అన్నారు. సుమారు 40 సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసిన ఎస్ఐ మన్సూర్ ఖాన్, 36 సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసిన హెడ్ కానిస్టేబుల్ గంగరాజంల సేవలను ఈ సందర్భంగా గుర్తు చేస్తూ వారి అనుభవం, సేవలు భవిష్యత్ తరాలకు ఎంతో స్ఫూర్తివంతంగా నిలుస్తాయన్నారు. పదవి విరమణ అనంతరం  కుటుంబ సభ్యులతో అనందంగా వారి భావిజీవితం ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో గడపాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ వేణు, పదవి విరమణ పొందిన పోలీసు అధికారుల కుటుంబ సభ్యులు  పాల్గొన్నారు.IMG-20250329-WA0059

Tags: