రాజేశ్వర్ రెడ్డి కు న్యావాదుల అభినందనలు

రాజేశ్వర్ రెడ్డి కు  న్యావాదుల అభినందనలు

తెలంగాణ హైకోర్టు బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడిగా జగిత్యాల జిల్లా వాసి గడ్డం రాజేశ్వర్ రెడ్డి ఎన్నిక

జగిత్యాల:తెలంగాణ హైకోర్టు బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడిగా జగిత్యాల జిల్లా వాసి గడ్డం రాజేశ్వర్ రెడ్డి ఎన్నికయ్యారు. గొల్లపల్లి మండలం వేనుగుమట్ల గ్రామానికి చెందిన రాజేశ్వర్ రెడ్డి, హైకోర్టులో సీనియర్ న్యాయవాది అయిన రేసు మహేందర్ రెడ్డి IMG-20250402-WA0085 దగ్గర జూనియర్ గా శిక్షణ పొంది, తర్వాత రెవెన్యూ శాఖలో ఏజీపీ (అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్)గా కూడా సేవలందించారు. న్యాయరంగంలో అనుభవం మరియు ప్రతిభతో అందరి మన్ననలు పొందిన రాజేశ్వర్ రెడ్డి, ఇటీవల జరిగిన ఎన్నికల్లో తెలంగాణ హైకోర్టు బార్ అసోసియేషన్ ఉపాధ్యక్ష పదవికి ఎన్నికై స్థానికులకు, న్యాయవాదుల సమాజానికి గర్వం కలిగించారు.  

గతంలో హైకోర్టు న్యాయవాదిగా మరియు రెవెన్యూ ఏజీపీగా విజయవంతమైన కెరీర్ కలిగిన రాజేశ్వర్ రెడ్డి ఎన్నికకు జగిత్యాల జిల్లా బార్ అసోసియేషన్ న్యాయవాదులు, శ్రేయోభిలాషులు హర్షం వ్యక్తం చేశారు. జిల్లా న్యాయవాదులు మరియు శ్రేయోభిలాషులు అతని విజయాన్ని అభినందించారు.

Tags: