విద్యుత్ ప్రమాదాల నివారణకు కృషి. టీజీఎన్పిడిసిఎల్ ఎస్ఈ సాలియా నాయక్.
విద్యుత్ ప్రమాదాల నివారణకు కృషి.
టీజీఎన్పిడిసిఎల్ ఎస్ఈ సాలియా నాయక్.
చురకలు విలేకరి, జగిత్యాల, మార్చి 18: విద్యుత్ ప్రమాదాల పట్ల ఉద్యోగులకు అవగాహన కల్పిస్తూ వారి శ్రేయస్సు గురించి పాటుపడుతున్నామని జగిత్యాల సర్కిల్ సూపెరిండెంట్ ఇంజనీర్ సాలియా నాయక్ అన్నారు. మంగళవారం విద్యుత్ ఉద్యోగులచే ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఉద్యోగులు భద్రతా పట్ల అత్యంత జాగ్రత్త గా వ్యవహరించాలని, ఎప్పటికప్పుడు సూచనలు జారీ చేస్తూ వారికి భద్రత పరికరాలు అందచేస్తున్నామని తెలిపారు. విద్యుత్ ప్రమాదాలను నివారించడానికి, క్షేత్ర స్థాయిలో పనిచేసే ఉద్యోగులందరూ నివారణ చర్యలు చేపడుతున్నామన్నారు సెక్షన్ ఇంఛార్జి ప్రతిరోజూ 15 నిమిషాలు పనికి ముందు భద్రతా చర్యల గురించి సిబ్బందితో చర్చించాలని, అనుమతి కలిగిన అధికారి తగిన జాగ్రత్తతో మాత్రమే లైన్ క్లియర్ ఇవ్వాలి, ఫోన్ ద్వారా లైన్ క్లియర్లను ఇవ్వడాన్ని నివారించాలన్నారు. విధుల్లో ఉన్న
ఎస్ఎల్ఐ, ఎల్ఐ లు బ్రేక్ డౌన్ వర్క్ లొకేషన్ వద్ద ఉండాలి మరియు లైన్ డిశ్చార్జ్ చేయబడిందని పనిని నిర్వహించడానికి సురక్షితంగా ఉండేలా చూసుకోవాలన్నారు.ఫీల్డ్ సిబ్బందికి అన్ని భద్రతా పరికరాలను అందుబాటులో ఉంచాలని, తప్పనిసరిగా వినియోగించేటట్లు చేయాలి .
డివిజనల్ ఇంజనీర్, టెక్నికల్, సర్కిల్ ఆఫీస్ నోడల్ సేఫ్టీ ఆఫీసర్లు సిబ్బంది భద్రతా నిబంధనలకు లోబడి పనిచేస్తున్నారో లేదో ఆకస్మిక తనిఖీలు చేపట్టాలన్నారు. టీజీ ఎన్పీడీసీఎల్ లో తాజా ప్రమాణాల భద్రతా విధానాలతో ఉద్యోగులకు తగు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తూ, సిబ్బందికి అన్ని రకాల భద్రత పరికరాలు హెల్మెట్, గ్లోవ్స్, పోర్టబుల్ ఎర్తింగ్ షార్ట్ , సర్క్యూట్ కిట్లు, సేఫ్టీ షూస్, ఇన్సులేటెడ్ టూల్స్, వోల్టేజ్ డిటెక్టర్ మొదలైనవి అందచేస్తూ , వారికి నియమిత కాల వ్యవధిలో సమీక్షలు నిర్వహిస్తూన్నామని తెలిపారు. విద్యుత్ ప్రమాదాలను నివారించడానికి ఫీల్డ్ సిబ్బంది నుండి సీనియర్ అధికారుల వరకు ఉద్యోగులందరి నుండి సమిష్టి కృషి అవసరమని , సమర్థవంతంగా తగ్గించడానికి అన్ని అంశాలలో భద్రతకు ప్రాధాన్యత ఇవ్వడం చాలా ముఖ్యమని , నిరంతర శిక్షణ మరియు భద్రతా పద్ధతులను బలోపేతం చేయడం వలన సంస్థలోని భద్రతా ప్రమాణాలను పెంచగలుగుతున్నామని తెలిపారు.