మైనార్టీల సంక్షేమానికి పెద్దపేట. ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్.

మైనార్టీల సంక్షేమానికి పెద్దపేట.  ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్.

మైనార్టీల సంక్షేమానికి పెద్దపేట.

ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్.

చురకలు ప్రతినిధి, జగిత్యాల, మార్చి 23: మైనార్టీల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. ఆదివారం ధర్మపురి పట్టణంలోని ఎస్ హెచ్ గార్డెన్లో తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు విప్ అడ్లూరి హజరై ముస్లింలకు ఖర్జురా తిన్పించి ఉపవాస దీక్షను విరమింపజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో మైనార్టీల సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తామన్నారు. మైనార్టీలకు రాష్ట్ర ప్రభుత్వం
అన్ని విధాలుగా అండగా ఉంటుందని, కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని మతాలను సమానంగా చూస్తుందన్నారు. త్వరలోనే మైనార్టీ కార్పోరేషన్ ద్వారా స్వయం ఉపాధి కొరకు రుణాలను
మంజూరు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మైనార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.IMG-20250323-WA0095

Tags: