మూడో కన్ను పై మున్సిపాలిటీ కుట్రకోణం

మూడో కన్ను పై మున్సిపాలిటీ కుట్రకోణం

మూడో కన్నుపై మున్సిపాలిటీ కుట్రకోణం.

వివాదస్పదంగా మున్సిపల్ తీరు..


చురకలు ప్రతినిధి, జగిత్యాల, మార్చి 24:  నేరాలు ఘోరాలు అరికట్టడానికి పోలీసు యంత్రాంగం ఎంతో శ్రమించి ఏర్పాటు చేసిన మూడో కన్నుపై మున్సిపాలిటీ ఉద్యోగులు కుట్రను పోలీసులు చాకచక్యంగా చేదించారు. ఉద్యోగుల నిర్వాకంపై జగిత్యాల పట్టణ ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు.
నేరాల నియంత్రణ కోసం జగిత్యాల పట్టణంలో పలు కూడళ్లలో ప్రభుత్వ నిధులు, పలు సంఘాల సహకారంతో ఏర్పాటు చేసిన సిసి కెమెరాల కేబుళ్లను కొందరు మున్సిపల్ సిబ్బంది ఉద్దేశ్య పూర్వకంగా ధ్వంసం చేయడం కలకలం రేపింది. కొందరు మున్సిపల్ సిబ్బంది ట్రాఫిక్ నిబంధనలు పాటించకుండా వాహనాలు నడుపుతూ పట్టుబడగా వారికి పోలీసులు జరిమానాలు విధించారు. దీంతో మున్సిపల్ సిబ్బంది మున్సిపల్ ఏఈ ఆదేశాల మేరకు మున్సిపల్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ లో విధులు నిర్వహిస్తున్న నక్క భూంరాజ్, జాకీ లు పట్టణంలో ని పలు ప్రధాన కూడళ్లలోని సిసి కెమెరాల కేబుళ్లను ధ్వంసం చేసి సిసి కెమెరాలు పని చేయకుండా చేశారు. గతంలో తెలంగాణ ఉద్యమం, పలు నిషేధిత సంస్థల, అసాంఘిక కార్యక్రమాల నియంత్రణతో పాటు దొంగతనాలు, నేరాల నియంత్రణలో ఎంతగానో ఉపయోగపడ్డ సిసి క్యామేరాలను బాధ్యతలో ఉన్న పూరపాలక అధికారులు, సిబ్బంది నిర్వీర్యాం చేయడం పలు విమర్శలకు తావిస్తుంది. గత రెండు రోజులగా సిసి కెమెరాలు పని చేయకపోవడంతో పోలీస్ అధికారులు రంగంలోకి దిగి దర్యాప్తు చేపట్టగా సిసి కేబుళ్లను మున్సిపల్ సిబ్బంది ధ్వంసం చేసినట్లు నిర్ధారించారు. నిత్యం ప్రజల రక్షణ, నేరాల నియంత్రణ, ఆవంఛానీయ సంఘటనలు జరిగినప్పుడు సిసి కెమెరాల పూటెజీ కీలకంగా మారుతుంది. సిసి కెమెరాల కేబుళ్లను ధ్వంసం చేసి సిసి కెమెరాలు పని చేయకుండా చేయడంతో పోలీసులు తీవ్రంగా పరిగణించి సదరు మున్సిపల్ ఏఈ, సిబ్బందిపై కేసు నమోదు చేశారు. ప్రజలకు జవాబుదారిగా ఉండాల్సిన ప్రభుత్వ శాఖ అధికారి, సిబ్బంది ప్రభుత్వ అస్తులనే ధ్వంసం చేయడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.Screenshot_20250324_230520_Chrome

Tags: