పేకాట స్థావరంపై సీసీఎస్ పోలీసుల దాడి ఆరుగురి అరెస్టు... రూ.32490 నగదు, 6 సెల్ ఫోన్ల స్వాధీనం ...
By: Mohammad Imran
On
పేకాట స్థావరంపై సీసీఎస్ పోలీసుల దాడి
ఆరుగురి అరెస్టు... రూ.32490 నగదు, 6 సెల్ ఫోన్ల స్వాధీనం ...
చురకలు ప్రతినిధి, జగిత్యాల, మార్చి 27: జగిత్యాల జిల్లా మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని కల్వకోట గ్రామ శివారులో పేకాట ఆడుతున్నారన్న సమాచారం మేరకు పేకాట స్థావరం పై సీసీఎస్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో దాడి చేసి ఆరుగురిని అరెస్ట్ చేసి వారి వద్ద నుండి రూ.32490 నగదు,6 మొబైల్స్ స్వాధీనం చేసుకున్నారు. పేకాట ఆడుతూ పట్టుబడ్డ వారిని మేడిపల్లి పోలీసులకు అప్పగించగా కేసు నమోదు చేశారు. జిల్లా ఎస్పీ ఆదేశాలతో అక్రమ,అసాంఘిక కార్యక్రమాలపై నిఘా పటిష్టం చేసి,పక్క సమాచారంతో దాడులు నిర్వహిస్తున్నట్లు సిసిఎస్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ తెలిపారు.ఈ దాడుల్లో హెడ్ కానిస్టేబుల్ రమేశ్,కానిస్టేబుళ్లు వినోద్ రమేష్ పాల్గొన్నారు.
Tags: