వందకోట్ల వ్యాపారానికి చేరుకోవాలి అదనపు కలెక్టర్

వందకోట్ల వ్యాపారానికి చేరుకోవాలి అదనపు కలెక్టర్

వంద కోట్ల వ్యాపారానికి చేరుకోవాలి.

జిల్లా అదనపు కలెక్టర్ బి.ఎస్. లత.


చురకలు ప్రతినిధి, జగిత్యాల, ఏప్రిల్ 10 : జగిత్యాల గాయత్రి కో- అపరేటివ్ అర్బన్ బ్యాంక్ ఈ ఏడాది వందకోట్ల వ్యాపార టర్నోవర్ కు చేరుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ బి.ఎస్. లత ఆకాంక్షించారు. గురువారం గాయత్రి కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ప్రధాన కార్యాలయంలో అంతర్జాతీయ సహకార సంవత్సరాన్ని పురస్కరించుకొని వినియోగదారుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ లత మాట్లాడుతూ జగిత్యాల కేంద్రంగా ప్రస్థానాన్ని ప్రారంభించిన గాయత్రి కో-అపరేటివ్ అర్బన్ బ్యాంకు రెండు తెలుగు రాష్ట్రాలకు విస్తరించి, కర్ణాటక మహారాష్ట్ర లకు విస్తరించ తలపెట్టడం ప్రశంసనీయమన్నారు. కార్యక్రమానికి విశిష్ట అతిథిగా హాజరైన జిల్లా సహకార అధికారి సి.హెచ్. మనోజ్ కుమార్ మాట్లాడుతూ జగిత్యాల కేంద్రంగా గాయత్రి కో-అపరేటివ్ అర్బన్ బ్యాంక్ అభివృద్ధి వెనుక బ్యాంకు సీ.ఇ.వో, సిబ్బంది కృషి, పట్టుదల వున్నాయన్నారు. భవిష్యత్తులో గాయత్రి బ్యాంకు మరింత అభివృద్ధిని సాధించాలన్నారు. లీడ్ బ్యాంకు మేనేజెర్ రాంకుమార్ మాట్లాడుతూ ఖాతాదారుల సమస్యల పరిష్కారంలో గాయత్రి బ్యాంక్ అగ్రస్థానంలో ఉందన్నారు. నిరార్ధక ఆస్తుల నిర్వహణలో గాయత్రి కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ పనితీరు అద్భుతమని ప్రశంసించారు.
గాయత్రి కోపరేటివ్ అర్బన్ బ్యాంక్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి వనమాల శ్రీనివాస్ మాట్లాడుతూ గాయత్రి కోపరేటివ్ అభివృద్ధి ప్రస్థానాన్ని వివరించారు. ఈ కార్యక్రమంలో గాయత్రి కోపరేటివ్ అర్బన్ బ్యాంక్ జి.ఎం శ్రీలత, జిల్లా సహకర శాఖాధికారి కార్యాలయం సూపరింటెండెంట్ బి.సుజాత, సహకార శాఖ సిబ్బంది, గాయత్రి బ్యాంకు ఖాతాదారులు పాల్గొన్నారు.IMG-20250410-WA0117

Tags: