పరమ పవిత్రం...... పునరుపరమ పవిత్రం.... పునరుత్థాన దినం ..
పరమ పవిత్రం.... పునరుత్థాన దినం
..............................................
రామ కిష్టయ్య సంగనభట్ల...
9440595494
.........................................
ఈస్టర్ పండగ క్రైస్తవులకు పరమ పవిత్ర దినం. ఈస్టర్ ఆదివారం జరుపుకుంటారు. పరమ పవిత్ర బైబిల్ సంబంధిత కొత్త నిబంధన లో పేర్కొన్న ప్రకారం కల్వరి గిరి లో యేసు ప్రభువును రోమనులు శిలువ వేసి హత మార్చగా, ఖననానంతారం, మూడవ రోజున నిర్జీవితుడైన క్రీస్తు పునరుత్థానం చెందిన పవిత్ర దినాన్ని క్రైస్తవులు ఈస్టర్ పర్వ దినంగా జరుపుకుంటారు. ఈ దినాన్ని దేవుని ఎంతో అద్భుతమైన పుణ్య దినంగా భావిస్తారు. 40 రోజులపాటు ఉపవాస దీక్షలు ప్రార్థనలు, ప్రాయశ్చిత్తం ఆచరించిన సందర్భంగా జీసస్ అభిరుచికి ఉన్నత స్థితిగా పరాకాష్టగా భావిస్తారు...పునరుత్థానము/ పునరుద్ధానం అనగా క్రైస్తవ పరిభాషలో మరణించిన తర్వాత ఆత్మ రూపంలో తిరిగి లేవడం. పునరుత్థానాన్ని మరణంపై యేసు ప్రభువు గెలిచిన విజయోత్సవంగా క్రైస్తవులు ఈస్టర్ పండుగ జరుపుకుంటారు. ఈస్టర్ అనే పేరు పునర్జన్మ దేవత అయిన ఈస్టారా నుండి వచ్చిందని విశ్వసిస్తారు. ఈస్టర్ పర్వదినాన్ని ఆచరించే ఆదివారానికి ముందు వారాన్ని పవిత్రవారంగా పరిగణిస్తారు.. క్రైస్తవులకు కు ఇది అతి పెద్ద పండుగ. ఈ పండుగ వసంత ఋతువులో వస్తుంది. ప్రధానంగా ఈస్టర్ త్రి దినాలను.... మౌండే, థ ర్స్ డే, గుడ్ ఫ్రైడే, హోలీ సాటర్ డే గా జరుపుకుంటారు. క్రిస్మస్ లాగా ఈస్టర్ పండుగ ప్రతి సంవత్సరం ఒకే తేదీన రాదు. సమరాత్రి అనంతరం, 9వ తేదీ తర్వాత పౌర్ణమి అనంతరం వచ్చే తొలి ఆదివారం నాడు ఈ పండుగ జరుపు కోడానికి నిర్ణయిస్తారు. ఏసుప్రభు పరమ పదించిన అనంతరం, ఆయన అనుయాయులు, నిరాశ నిస్పృహల మధ్య కొట్టుమిట్టాడుతున్న పరిస్థితిని చూడలేక ఏసు ప్రభువు తిరిగి వారి కోసం పునర్జీవితుడయ్యాడని, తిరిగి వచ్చారని కథనం. క్రీస్తు విశ్వసనీయ అనుయాయులు అందరూ ఉదాసీనులై ఉన్న సమయంలో, ఓ స్త్రీ వారి వద్దకు వచ్చి ఆశ్చర్య చకితులను చేసిన, అనంతరం వారు ఏసు మృతదేహంపై నీళ్లు చల్లడానికి, సమాధి వద్దకు వెళ్లగా సమాధి పై భాగం తెరవబడి ఉండడాన్ని, అందులో ఇద్దరు ధవళ వస్త్ర దారులైన దేవదూతలు ఉండడాన్ని గమనించారు. ప్రస్ఫుట కాంతి ముఖా లతో ఉన్న ఆ దేవదూతలు... ఏసు ప్రాణాలతో బయట పడినారని వివరించారు. ఆ సమాధి వద్ద కూర్చుని ఏడుస్తున్న మగ్ధలేనా, ఈ విషయాన్ని విశ్వసించని స్థితిలో ఆమె ఏసు గొంతు వినడం జరిగింది. ప్రభువును తొలిసారి చూసింది. తాను పునరుజ్జీవం పొందిన ఈ విషయాన్ని తన అనుయాయులకు చెప్పమని క్రీస్తు కోరిన ఈ క్రమంలో మగ్ధలేనా ఆ సందేశాన్ని ప్రభువు నుండి తీసుకొని అనుచరులకు వినిపించింది. ఈ సందర్భాన్ని క్రైస్తవులు ఈస్టర్ పండుగలా జరుపుకుంటారు. క్రైస్తవులు ఈస్టర్‌ను వ్యక్తిగతంగా మరియు సార్వత్రికంగా పాటిస్తారు. పునరుత్థానం ద్వారా తనననుసరించిన వారికి మరణం తర్వాత నిత్య జీవముందనే విషయాన్ని తెలియజెప్పాడు క్రీస్తు. జర్మనీ భాషలో ""ఈ ఓస్టర్"" అంటారు. అంటే దీని అర్థం ""దేవి" అని. ఈ దేవిని వసంత దేవిగా పిలుస్తారు. ఈస్టర్ పండగను క్రిస్మస్ లాగా ఘనంగా జరుపుకోకున్నా, పవిత్రంగా, ఉత్తమంగా, సాంప్రదాయ రీతిలో జరుపుకుంటారు. క్రైస్తవ విశ్వాసం ఉన్నవారు మతపరమైన ఆచారాలు, జాగరణలు, చర్చికి వెళ్లడం ద్వారా ఈస్టర్‌ను పాటిస్తారు, సంప్రదాయాల ప్రకారం, ఆదివారం ఉదయం చర్చి వెలుపల కొత్త మంటను వెలిగించి, ఈస్టర్ జాగరణలో పాల్గొనడం ద్వారా ఈస్టర్ ఆదివారం జరుపుకుంటారు. ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది క్రైస్తవులు ప్రత్యేక చర్చి సేవలు, సంగీతం, క్యాండిల్ లైట్, పువ్వులు, చర్చి గంటలు మోగించడంతో ఈస్టర్‌ను జరుపు కుంటారు. ఈస్టర్ ప్రకటనను పఠించడం, పాత నిబంధన చదవడం, కీర్తనలు పాడడం, ఈస్టర్ డే శుభాకాంక్షలు చెప్పడం వేడుకలలో భాగాలు. ఫిలిప్పీన్స్ మరియు స్పెయిన్ వంటి కొన్ని దేశాలలో ఈస్టర్ ఊరేగింపులు జరుగుతాయి. చాలా మంది క్రైస్తవులు ఈస్టర్‌ను గొప్ప పండుగగా భావిస్తారు. క్రైస్తవ విశ్వాసం ప్రకారం, యేసుక్రీస్తు పునరుత్థానమయ్యాడని గుర్తుచేసుకోవడానికి జరుపుకునే వేడుకల రోజు.