సమస్యవస్తే పరిష్కారం దిశగా ఆలోచించాలి ఎస్పీ అశోక్ కుమార్
*సమస్య వస్తే పరిష్కారం దిశగా ఆలోచించాలి తప్ప మానసిక వేదనకు గురి కాకూడదు:జిల్లా ఎస్పి అశోక్ కుమార్
*- - - పోలీస్ సిబ్బంది,అదికారులకు వ్యక్తిగత, మానసిక, శాఖపరమైన సమస్య వుంటే నాకు తెలియజేయండి*
*- - మానసిక ఒత్తిడిని ఎదుర్కొనే నైపుణ్యాలపై పోలీసులకు అవగాహన శిబిరం.*
వృత్తిపరంగా అత్యధిక ఒత్తిడి ఎదుర్కొనే రంగాలలో ఒకటి పోలీస్ శాఖ. ప్రజల రక్షణలో 24x7 విధులు నిర్వహించే పోలీసులు, నిత్యం ఒత్తిడులు, ప్రమాదాలు, సామాజిక ఒత్తిడి, కుటుంబాలకు దూరంగా గడపడం వంటి అనేక మానసిక సవాళ్లను ఎదుర్కొంటున్నారు. దీని ప్రభావంగా డిప్రెషన్, ఆత్మహత్యా భావనలు వంటి మానసిక సమస్యలు వారికి ఎదురవుతున్నాయి వాటి నివారణ గురించి, వారి మానసిక ఆరోగ్యం కాపాడటం అనేది తక్షణ అవశ్యకతగా గుర్తించి రాష్ట్ర డిజిపి జితేందర్ ఆదేశాల మేరకు జిల్లా పోలీస్ ప్రదాన కార్యాలయం లో ప్రఖ్యాత మానసిక నిపుణులు డాక్టర్ అశోక్ కుమార్ గారిచే మానసిక ఆరోగ్య అవగాహన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమo లో జిల్లా ఎస్పి అశోక్ కుమార్ , జిల్లా పోలీస్ అదికారులు ,సిబ్బంది పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రముఖ మానసిక నిపుణుడు డాక్టర్ అశోక్ కుమార్ పోలీసు అధికారులు,సిబ్బంది ఎదుర్కొంటున్న వివిధ మానసిక ఒత్తిడుల పై సమగ్ర అవగాహన ఇచ్చారు. ముఖ్యంగా, నిరంతర ఒత్తిడిలో విధులు నిర్వహించే పోలీస్ సిబ్బందికి ఎలాంటి మానసిక సమస్యలు ఎదురవుతాయో, వాటిని ఎలా గుర్తించాలో, మరియు వాటిని పరిష్కరించుకునే మార్గాల, ఒత్తిడి నిర్వహణ, మానసిక స్థైర్యం, ఆత్మవిశ్వాసం పెంపు, మరియు కుటుంబ, వ్యక్తిగత జీవితానికి సమతుల్యత,ఫైన్షియల్ మేనేజ్మెంట్ వంటి పలు అంశాల పై అవగాహన, పలు సూచనలు అందించారు.
ఈ సందర్బంగా ఎస్పి మాట్లాడుతూ .... మానసిక ఆరోగ్యం అనేది శారీరక ఆరోగ్యంతో సమానమైనదే. ముఖ్యంగా పోలీసుల వంటి బాధ్యతాయుతమైన ఉద్యోగాల్లో ఉండే వ్యక్తులు తమ మానసిక స్థితిని అర్థం చేసుకోవడం, అవసరమైన సమయంలో సహాయం తీసుకోవడం అత్యంత అవసరం అన్నారు. సమస్య వస్తే పరిష్కారం దిశగా ఆలోచించాలి తప్ప మానసిక వేదనకు గురికాకూడదుఅని సమస్య గురించి కుటుంబ సభ్యులతో, స్నేహితులతో గాని బంధువులకు తెలుపడం వల్ల అట్టి సమస్యకు పరిష్కారం దొరికే అవకాశం ఉంటుందని అన్నారు. శాంతి భద్రతల పరిరక్షణలో క్షేత్రస్థాయిలో పని చేసే పోలీస్ సిబ్బంది పాత్ర కీలకం అట్టి సిబ్బంది సంక్షేమానికి పోలీస్ శాఖ కట్టుబడి ఉందని తెలిపారు. పోలీస్ సిబ్బందికి శాఖపరమైన, వ్యక్తిగత సమస్య వుంటే నా దృష్టి కి తీసుకరవలని ఆయా సమస్యల పరిష్కరనికి కృషి చేయడం జరుగుతుందన్నారు.ఎలాంటి సమస్యవచ్చిన దానికి పరిస్కరం ఉంటుందని,సమస్యలకు ఆత్మహత్యలు పరిష్కారం కాదని అన్నారు. మీ భద్రత ,ఆరోగ్యం మాకు ముఖ్యమైనవి అని సిబ్బందికి భరోసా కల్పించారు.ఇటువంటి కార్యక్రమాలు తరచూ నిర్వహించి సిబ్బందికి మానసిక ఉపశమనం కలిగించేందుకు కట్టుబడి ఉన్నాము అన్నారు.ఈ అవగాహన కార్యక్రమానికి సహకరించి జిల్లా పోలీసులకు విలువేనా సూచనలు చేసిన రాష్ట్ర ఆత్మహత్యలు నివారణ సంస్థ ఛైర్మన్ , సభ్యులకు జిల్లా పోలీస్ శాఖ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు..
ఈ సందర్భంగా మానసిక ఒత్తిడిని జయించడానికి మరియు ఆత్మహత్యల నివారణ గురించి చేయవలసిన సలహాలు సూచనలను గురించి సూచించే బ్రోచర్ను జిల్లా ఎస్పీ ఆవిష్కరించారు.
ఈ యొక్క కార్యక్రమo లో అదనపు ఎస్పి భీమ్ రావు ,డిఎస్పి రఘు చంధర్ , రిజర్వ ఇన్స్పెక్టర్ లు కిరణ్ కుమార్ ,వేణు,ఇన్స్పెక్టర్ వేణుగోపాల్, కృష్ణారెడ్డి శ్రీనివాస్ శ్రీధర్ రఫీక్ ఖాన్ మరియు ఎస్.ఐ లు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.