వక్ఫ్ సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలి.
By: Mohammad Imran
On
వక్ఫ్ సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలి.
చురకలు విలేకరి, జగిత్యాల, ఏప్రిల్ 11: వక్ఫ్ సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలని కోరుతూ ముస్లిం పర్సనల్ లా బోర్డు ఆదేశాల మేరకు శుక్రవారం ప్రత్యేక ప్రార్థనల అనంతరం జగిత్యాల పట్టణంలోని అన్ని మస్జీదుల వద్ద ముస్లింలు పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. ఈ సందర్బంగా పెద్ద సంఖ్యలో యువత చేతికి నల్లబ్యాడ్జీలు ధరించి, ప్లకార్డులతో నిరసన తెలిపారు. ఈ సందర్బంగా నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలని, రాజ్యాంగానికి వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన వక్ఫ్ బిల్లును వెనక్కి తీసుకొనే వరకు శాంతియుతంగా నిరసన తెలుపుతామన్నారు. ఈ కార్యక్రమంలో ముస్లిం సంఘాల నాయకులు, యువకులు తదితరులు పాల్గొన్నారు.
Tags: