ఆంతర్ జిల్లా దొంగ అరెస్ట్ 25 లక్షల విలువగల బంగారు ఆభరణాలు స్వాదినం
*అంతర్ జిల్లా దొంగ అరెస్ట్...*
*25 లక్షల విలువ గల బంగారు ఆభరణాల స్వాధీనం*
జగిత్యాల పట్టణంలోని ఎస్పీ కార్యాలయంలో జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంతర్ జిల్లా దొంగలు పట్టుకోవడం జరిగిందని అతని వివరాలు
మంచిర్యాల పట్టణానికి చెందిన బక్క శెట్టి కొమురయ్య అలియాస్ అజయ్ కుమార్ వయసు 53 సంవత్సరాలు గత కొన్ని సంవత్సరాలుగా జగిత్యాల జిల్లా మల్యాల మండలం రాజారాం గ్రామంలో నివాసం ఉంటు దొంగతనాలే వృత్తిగా గత 28 సంవత్సరాలుగా జీవనం సాగి స్తున్నారు ఈ మూడు నెలల వ్యవధిలో వరుసగా జగిత్యాల పట్టణంలో ఐదు దొంగతనాలకు పాల్పడ్డాడు. దాదాపుగా ఎనిమిది క్రిమినల్ కేసులు అతనిపై నమోదైనవి.ఈనెల 9వ తేదీన పట్టణంలోని కొత్త బస్టాండ్ ప్రాంతంలో పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా బక్కశెట్టి కొమురయ్య పోలీసులకు పట్టుబడ్డాడు. ఇతని వద్ద
బంగారు ఆభరణాలను286.570 గ్రాముల బంగారు ఆభరణాలను దాదాపు 25 లక్షల విలువ గలవి పట్టుకోవడం జరిగింది.
ఈ సమావేశంలో జిల్లా ఎస్పీ అశోక్ కుమార్, జగిత్యాల డిఎస్పి రఘు చందర్, పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ వేణు, ఇన్స్పెక్టర్ గీత తదితరులు పాల్గొన్నారు