అవంచానియా ఘటనలకు ఆస్కారం లేకుండా హనుమాన్ జయంతి ఉత్సవాలకు ఏర్పాట్లు ఎస్పీ అశోక్ కుమార్

అవంచానియా ఘటనలకు ఆస్కారం లేకుండా హనుమాన్ జయంతి ఉత్సవాలకు ఏర్పాట్లు ఎస్పీ అశోక్ కుమార్

 

*అవాంఛనీయ ఘటనలకు ఆస్కారం లేకుండా చిన్న హనుమాన్ జయంతి ఉత్సవాలకు పటిష్ట భద్రత*

నిరంతరం సిబ్బందికి వైర్లెస్  సెట్ ద్వారా సూచనలు చేస్తూ భక్తులకు సులభంగా మాల విరమణ,దర్శనం అయ్యేలా, ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక చొరవ

చురకలువిలేఖరి

జగిత్యాల

హనుమాన్ జయంతిని పురస్కరించుకొని కొండగట్టు ఆంజనేయ స్వామి దేవస్థానంలో భక్తుల రద్దీ పెరిగిన నేపIMG-20250412-WA0020థ్యంలో, జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్  అర్ధరాత్రి ఆకస్మికంగా పర్యటించారు. ఈ సందర్బంగా ఆయన భద్రతా ఏర్పాట్లు, ట్రాఫిక్ మేనేజ్‌మెంట్, అత్యవసర సేవల ఏర్పాట్లను సమీక్షించారు. భద్రతా ఏర్పాట్లను స్వయంగా తనిఖీ చేస్తూ, పోలీస్ అధికారులకు, సిబ్బందికి సెట్ ద్వారా సూచనలు, ఆదేశాలు ఇస్తూ అధికారులను, సిబ్బందిని సమన్వయ పరుస్తూ, రాత్రి వేళల్లో కూడా పటిష్టమైన బందోబస్తు ఉండేలా, అనుకోని సంఘటనలు జరిగితే  తక్షణమే స్పందించేలా యంత్రాంగం సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు.అంతేకాక, భక్తులతో స్వయంగా మాట్లాడి, వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. హనుమాన్ జయంతి నేపథ్యంలో ప్రజల భద్రతే ముఖ్యమని, అన్ని విభాగాల సమన్వయంతో హనుమాన్ జయంతిని శాంతియుతంగా, సురక్షితంగా నిర్వహిస్తున్నట్లు  తెలిపారు.

Tags: