నూతన కార్యవర్గం ఎన్నిక

నూతన కార్యవర్గం ఎన్నిక

నూతన కార్యవర్గం ఎన్నిక.

చురకలు విలేకరి, జగిత్యాల, ఏప్రిల్ 25 : జగిత్యాల జిల్లా తుర్కకాశ సంక్షేమ సంఘ నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా పట్టణంలోని రాయల్ ఫంక్షన్ హాల్ ఏర్పాటు చేసి సంఘ సమావేశంలో జిల్లా అధ్యక్షునిగా షేక్ ఇమామ్, ప్రధాన కార్యదర్శిగా సయ్యద్ అలీలను ఎన్నుకున్నట్లు రాష్ట్ర అధ్యక్షుడు షేక్ బడేసాబ్ తెలిపారు. ఎన్నికైన నూతన కార్యవర్గాన్ని పలువురు అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు సయ్యద్ జహంగీర్, ప్రధాన కార్యదర్శి షరీఫ్, అలీమ్, కరీం, గోరెమియా తదితరులు పాల్గొన్నారు.IMG-20250424-WA0040

Tags: