విద్యార్థులను పరామర్శించిన కాంగ్రెస్ నాయకులు
గురుకుల విద్యార్థులను పారమర్శించిన మెట్ పల్లి కాంగ్రెస్ నాయకులు
చురుకలు ప్రతినిధి
మెట్ పల్లి , ఏప్రిల్ 16:
కోరుట్ల : బుధవారం తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలుర పాఠశాల విద్యార్థులను పారమర్శించిన మెట్ పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కూన గోవర్ధన్
కొంతమంది చిన్నారులు అస్వస్థతకు గురైన విద్యార్ధులను వేసవిలో వడదెబ్బ తగలకుండా తీసుకునే జాగ్రత్తల గురించి వివరించారు. వీలైనంత ఎక్కువగా మంచినీటిని తాగాలని సూచించారు. అనంతరం హాస్పిటల్ ను సందర్శించి విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నారు.ఈ కార్యక్రమంలో మెట్ పల్లి కాంగ్రెస్ పార్టీ పట్టణ మాజీ అధ్యక్షులు ఖుతుబ్ పాషా, కాంగ్రెస్ సేవాదళ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అందె మారుతీ,కోరుట్ల పట్టణ ఎన్ ఎస్ యు ఐ అధ్యక్షులు షైక్ అమీర్,కోరుట్ల పట్టణ మైనర్టీ ప్రధాన కార్యదర్శి యండి ఫైసల్ తదితరులు పాల్గొన్నారు.