ఆరోగ్యావంతమైన జీవితానికి కృషి

ఆరోగ్యావంతమైన జీవితానికి కృషి

ఆరోగ్యవంతమైన జీవితానికి కృషి 

జగిత్యాల కలెక్టరేట్, ఏప్రిల్ 23 (ఆంధ్రప్రభ): చిన్నారుల ఆరోగ్యవంతమైన జీవితానికి కృషి చేస్తామని ఐసిడిఎస్ అంగన్వాడీ టీచర్ ఆస్కరి  బేగం IMG-20250422-WA0031అన్నారు. బుధవారం పోషన్ పక్వాడ కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని వాణినగర్ అంగన్వాడీ కేంద్రంలో గర్భిణీలు,బాలింతల సమక్షంలో
గ్రాడ్యుయేషన్ డే, సిబిఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. తల్లులకు పిల్లల అభివృద్ధి గురించి వివరించి అప్పుడే పుట్టిన పిల్లల నుంచి 6 సంవత్సరంల లోపు పిల్లల బరువులు ఎత్తులు తీసి స్థానికంగా దొరికే కూరగాయలు, పండ్లు,ఆకుకూరలు, చిరుధాన్యాలు విరివిగా తీసుకోవాలని తల్లులకు  సూచించారు.అనంతరం పెరటి తోటల ప్రాముఖ్యతను, పరిసరాల పరిశుభ్రత,వ్యక్తిగత పరిశుభ్రత శానిటేషన్ గురించి ప్రత్యేకమైన సలహాలు ఇచ్చినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో అంగన్వాడి టీచర్ ఆస్కరి బేగం మహిళలు,కిషోర బాలికలు పాల్గొన్నారు.

Tags: