ఈత సరదా విషాదంగా మారకూడదు. చిన్నచిన్న నిర్లక్ష్యాలు ప్రాణ నష్టానికి దారితీయవచ్చు. జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్.
ఈత సరదా విషాదంగా మారకూడదు.
చిన్నచిన్న నిర్లక్ష్యాలు ప్రాణ నష్టానికి దారితీయవచ్చు.
జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్.
చురకలు ప్రతినిధి, జగిత్యాల, ఏప్రిల్ 19 : వేసవికాలంలో పాఠశాలలు, కళాశాలలకు సెలవులు రావడంతో ఎంతో మంది పిల్లలు యువకులు ఎండ వేడి నుంచి సేద తీరటానికి, ఈత నేర్చుకోవడానికి చెరువులు, కాలువల వద్దకు ఈతకు వెళ్లే అవకాశం ఉన్నందున ఈ క్రమంలో ప్రమాదాలు జరిగి నీటిలో మునిగి ప్రాణ నష్టం జరుగుతుండటం వలన అందరూ ఈ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఈత సరదా విషాదంగా మారకూడదని జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ సూచించారు. శనివారం ఆయన మాట్లాడుతూ ఈత రానివారు బావులు, చెరువుల వద్దకు ఒంటరిగా వెళ్లకూడదని, ఈత నేర్చుకునే వారు వారి తల్లిదండ్రుల సమక్షంలో నేర్చుకోవాలని సూచించారు. ముఖ్యంగా తల్లిదండ్రులు తమ పిల్లలను చెరువుల వద్దకు కాలువల వద్దకు కుంటలు వద్దకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఏదైనా అనుకోని సంఘటన జరిగినట్లయితే పిల్లల ప్రాణానికి ప్రమాదమని, ఈ విషయంలో తల్లిదండ్రులు తగు జాగ్రత్తలు తీసుకొని పిల్లలను యొక్క కదలికలను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలని సూచించారు.