అబుజ్మాడ్ లో తూటాల వర్షం నేలకొరిగిన ఏడుగురులో అగ్రనేత దశ్రు
ఆబూజుమాడ్ లో తూటాల వర్షం.!
నేలకొరిగిన ఏడుగురులో అగ్రనేత దశ్రు, ఆయనపై 25 లక్షలు రివార్డు.!!
నిత్యం ఎన్కౌంటర్లతో అట్టుడుకుతున్న దండకారణ్యం
నేడు కేంద్ర కమిటీ సభ్యుడు హీడ్మ ఇంటికి షా
నక్సల్స్ పై తమవిధానాన్ని అమిత్ షా ప్రకటించే అవకాశం.
హైదరాబాద్, ప్రత్యేక ప్రతినిది
ఛత్తీస్గఢ్, ఒరిస్సా దండకారణ్యం విస్తరించిన ప్రాంతాలు యుద్ధభూమి గా మారి పోయింది. ఆదివారం అబూజమాడుకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వెళుతున్నారు. అమిత్ షా వెళ్లడానికి 48 గంటల ముందు నారాయణపూర్ జిల్లాలోని ఆ బూజుమాడు ప్రాంతంలో జరిగిన భారీ ఎన్కౌంటర్లో ఏడుగురు చనిపోయినట్లు వార్తలు వచ్చాయి ముందుగా 12 మంది మరణించారని ప్రచారం జరిగింది. అయితే ఈ ఎన్కౌంటర్లో ఇద్దరు ముఖ్య నాయకులు మరణించారని శనివారం వెలుగులోకి వచ్చింది అందులో ఒకరు సెంట్రల్ కమిటీ సభ్యుడు దసురు@కార్తీక్@విజయవాడకు చెందిన కార్తిక్ మరణించినట్లు ప్రకటించారు. పోలీసులకు ప్రకటించిన ఏడుగురు లో మడకం ప్రమీల, సోమరి పోయం, గూడ్స. రైను, కమలేష్, మేతూ ఉన్నట్లు పోలీసు అధికారులు శనివారం సాయంత్రం ప్రకటించారు. కాగా శాంతి చర్చల ప్రతినిధి సుధాకర్ పోలిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ ఎన్కౌంటర్లో చర్చల ప్రతినిధి సుధాకర్ మరణించాడని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది ఇద్దరు సైతం ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన వారే కావడం విశేషం. ఆదివారం అమిత్ షా నేరుగా మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ మిలిటరీ కమిషన్ సభ్యుడు మాడవి హిడ్మా ఇంటికి పువర్తికి వచ్చిన సమయంలో ప్రెస్ మీట్ లో వెల్లడిస్తారని భావిస్తున్నారు.
మాడవి హెడ్మాల్ ఇంటికి హోమ్ మంత్రి షా.. ఆయన వెంట జాతీయ మీడియా..!!
దీనికోసం చత్తిస్గఢ్లో ఉన్న కేంద్ర పోలీస్ బలగాలు హోం మంత్రి రాక ఏర్పాట్లలో భాగంగా మావోయిస్టుల ఏరివేత కార్యక్రమాన్ని వేగవంతం చేశారు. గడిచిన వారం రోజుల్లో పలుచోట్ల నక్సలైట్లు వర్సెస్ భద్రతా బలగాలకుమధ్య వరుసగా జరుగుతున్న ఎన్ కౌంటర్ లను పరిశీలిస్తే యుద్ధ వాతావరణం నెలకొన్నట్లు కనిపిస్తోంది. 48 గంటల్లో రెండు చోట్ల ఎన్కౌంటర్లు జరిగాయి ఒకచోట ఏడుగురు నక్సలైట్లు మరో జిల్లాలో ఇద్దరు నక్సలైట్లు హతమయ్యారు. ఈ లెక్కపై ఎవరికి తోచిన విధంగా వారు మాట్లాడుకుంటున్నారు.నక్సలైట్ల తో అమితుమీకి సిద్ధమైన కేంద్ర ప్రభుత్వం నేరుగా హిడ్మా వూరు పువ్వర్తికి హోం మంత్రి రావడం ఇది మరో సంచలనతకమైన వార్తగా నిలిచింది. ఆదివారం షా పువర్తిలోని హెడ్మా ఇంటికి వెళ్తారని, అమిత్ షావెంట జాతీయ మీడియా సైతం ఢిల్లీ నుండి ప్రాంతానికి వస్తున్నట్లు నారాయణపూర్ కాంకేర్ జిల్లాలో ప్రచారం జరుగుతుంది. పువర్తికి ఆ చుట్టుపక్కల పల్లెలను ఇప్పటివరకు పోలీసులు చేరుకోలేదు. బేస్ క్యాంపులో ఏర్పాటుతో ఒక్కో గ్రామం సైన్యం చేతికి వెళ్ళింది. ఇలాంటి సమస్య ఆత్మకమైన గ్రామానికి ఒక కేంద్ర హోం మంత్రి తెగింపుగా పూవర్తిగా చేరుకోవడం.. కేంద్ర బలగాల్లో మరింత ఆత్మస్థైర్యాన్ని నింపడమే అవుతుంది. మరో పదిహేను నెలల్లో2026 మార్చి 31 వరకు మావోయిస్టులను అంతం చేస్తామని చెబుతున్న కేంద్ర ప్రభుత్వం ఇప్పటికి దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో 350 మందిని మావోయిస్టులను చాలా సులభంగా హతం చేశారు...
ఎన్కౌంటర్లలో అమాయక ఆదివాసీలు మృతి చెందినట్లు ఆరోపణలు..
ఆ 350 మందిలో 250 మంది ఆదివాసి ప్రజలేనని ఆరోపణలు ఉన్నాయి .ఈ విషయాన్నిఅటవీ ప్రాంతం ప్రజలు చెబుతున్నారు.
అమాయక ఆదివాసి ప్రజలను మీలేషియా సభ్యులుగా పేర్కొంటూ ఆధార్ కార్డు ఉన్నవారిని సైతం సైన్యం హతమరుస్తుందని పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి.
ఈ నెల 2 నుండి 8 వరకు పీఎల్జీఏ 24 వ వార్షికోత్సవాలు జరుగుతున్న సమయంలో తమ పట్టును పెంచుకునేందుకు మావోయిస్టులు చేసిన ప్రయత్నాలను భద్రతా బలగాలు ఎప్పటికప్పుడు తిప్పికొట్టే నక్సల్స్ కు వరుసగా షాక్ మీద షాక్ లు ఇచ్చారు.
బీజాపూర్ జిల్లాలోని పామేడు పోలీసు స్టేషన్ పరిధిలో గల జీడిపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన రెండో సీఆర్పీ ఎఫ్ బెటాలియన్ క్యాంప్ పై ఈనెల 5 న దాదాపు నాలుగు గంటల పాటు రాకెట్ లాంచర్లతో దాడికి దిగారు.
ఈ ఘటనలో ముగ్గురు జవాన్లు గాయపడ్డారు. ముగ్గురు గా జవాన్ల గాయపడ్డ మర్నాడు వెంటపడి ఏడుగురు నక్సలైట్లు నారాయణపూర్ జిల్లాలో హతం చేశారు.
తిరిగి అదే క్యాంప్ పై ఈ నెల 7 న మరో సారి నక్సల్స్ దాడి యత్నం చేయగా భద్రతా బలగాలు తిప్పికొట్టాయి. బేఎస్ క్యాంపు లపై దాడులతో మావోయిస్టులు
దండకారణ్యం లో అలజడి సృష్టించారు. కానీ పెద్ద సంఖ్యలో దళాలు కుప్పకూలిపోతున్నాయి.
వారోత్సవాల సందర్భంగా కూంబింగ్ జరుపుతున్న భద్రతా బలగాలు తెలంగాణలో ములుగు జిల్లాలో ఏడుగురుని పోలీసులు కతం చేశారు. అటు నారాయణపూర్ జిల్లా లోని పంగూర్ అటవీ ప్రాంతంలో నక్సల్స్ కు చెందిన డంప్ ను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. అదే నారాయణపూర్ జిల్లాలో ఏడుగురిని బీజాపూర్ జిల్లాలో ఇద్దరిని మట్టుపెట్టి అమిత్ షా రాక కోసం రోడ్డు క్లియర్ చేశారు. మావోయిస్టుల డెన్ నుండి
ఏకంగా ఆయుధాలు తయారీ చేసే యంత్రాలను, ఆయుధాలు, గ్యాస్ సిలిండర్లు, ఎల్పీజి సిలిండర్లు స్వాధీనం చేసుకున్నారు.
వారోత్సవాల నేపథ్యంలో మావోయిస్టులు బీజాపూర్ జిల్లాలో పోలీసు ఇన్ఫార్మర్ నెపంతో నలుగురు గ్రామీణ వ్యక్తులను హతమార్చారు.
ఇందులో ఇద్దరు మాజీ సర్పంచ్ లు కాగా మరో ఇద్దరు మహిళలు ఉన్నారు.
గతంలో మునుపెన్నడూ లేని విధంగా నక్సల్స్ ఇద్దరు మహిళలను కుటుంబ సభ్యుల కళ్ళైదుటనే హత మార్చిన ఘటనలతో మావోయిస్టుల పై గ్రామీణ ప్రాంతాల్లో సంచలనం సృష్టించింది.
ఆదివారం అమిత్ షా రాక: డిప్యూటీ సీఎం విజయ్ శర్మ వెల్లడి.!
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఈ నెల 15 న ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని సుక్మా జిల్లాలో గల పువ్వర్తి గ్రామంలో పర్యటించి మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు నేత హెడ్మా కుటుంబ సభ్యులను కలుసుకోనున్నారని ఛత్తీస్గఢ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం విజయ్ శర్మ ఇటీవల విలేకరుల సమావేశంలో తెలిపారు.
ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో నూతన పోలీసు శిబిరాల ఏర్పాటు చేయడం ద్వారా దంతేవాడ, సుక్మా బీజాపూర్ జిల్లాలో మావోయిస్టు పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తున్న పలువురు నక్సలైట్లు లొంగుబాటు దారి తీసారు.
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా మార్గదర్శకత్వంలో ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో నక్సలిజం నిర్మూలన కోసం నిరంతరం కూంబింగ్ జరుపుతున్నారు. 2026 మార్చి నాటికి నక్సల్స్ రహిత రాష్ట్రంగా ప్రకటించాలనే లక్ష్యంగా చేసుకుని పోలీసులు పావులు కదుపుతున్నారు. ఈ కారణంగా దండకారణ్యంలో పూర్తిగా యుద్ధ వాతావరణంతో నిండిపోయి ఏ క్షణంలో ఎటువైపు నుండి తూటాల శబ్దం వినవలసి వస్తుందని ఆదివాసీలు అడవి పోతున్నారు ఇదే సమయంలో ఛాలెంజ్గా కేంద్ర హోమ్ మంత్రి పువర్తికి చేరుకోవడం కూడా మరింత సంచలనంగా మారింది.