తెలంగాణలో వేగంగా ఆపరేషన్ కాగార్

తెలంగాణలో వేగంగా ఆపరేషన్ కాగార్

తెలంగాణలో వేగంగాఆపరేషన్ కగార్.!!

ఇద్దరు కీలక నేతలు సహా ఏడుగురి ఎన్కౌంటర్.

భద్రాద్రి జిల్లాలో ఇటీవల కాలంలో 8 మంది హతం 
 
ఉత్తర తెలంగాణ అటవి ప్రాంత ఏరియా కమిటీలు వరుసగా నష్టం 

మావోయిస్టు పార్టీకి కోలుకోలేని ఎదురు దెబ్బ.


చురకలు,(హైదరాబాద్ ప్రత్యేక ప్రతినిధి)

-గత నెలలో ఖమ్మం భద్రాద్రి జిల్లాలో,ఉమ్మడి వరంగల్ ములుగు జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లతో తెలంగాణలోని మావోయిస్టు పార్టీ ఏరివేతలో భాగంగా ఆపరేషన్ కగార్ వేగంగా నడుస్తుందని వరస సంఘటనలు రుజువు చేస్తున్నాయి. దండకారణ్యం విస్తరించిన చత్తీస్గడ్, మహారాష్ట్ర జార్ఖండ్ ఒరిస్సా రాష్ట్రాల్లో ఆపరేషన్ కగార్ పెద్ద ఎత్తున ఎన్కౌంటర్లు చేస్తుంది విధితమే. ఆదివారం మావోయిస్టు పార్టీకి చెందిన ఇద్దరు ముఖ్య నాయకులు సహా ఏడుగురు నక్సలైట్ల బృందం ఆదివారం తెల్లవారుజామున తుపాకీ తూటాలకు నేలకొరిగింది. కరకు గూడెంలో ఐదుగురు, ఆదివారం తెల్లవారుజామున ఏడుగురు.. గడిచిన నాలుగు నెలల కాలంలో 16 మంది.. ఎన్కౌంటర్ల పరంపరతో తెలంగాణలో ఆపరేషన్ కగార్ విజయవంతంగా నడుస్తుందని తేటతెల్లమవుతుంది. తెలంగాణ గ్రేహౌండ్స్ పోలీసులు జల్లెడ పట్టి భద్రాద్రి జిల్లాలో ఐదుగురిని హతమార్చిన సంఘటన మరవకముందే తిరిగి మూలుగు జిల్లాలో ఏడుగురు హత మార్చి సంచలనం సృష్టించారు. సోమవారం నుండి 24వ పి ఎల్ జి ఏ వారోత్సవాలను జరపాల్సిందిగా కొయ్యూరు అమరవీరుల సంస్కరణ సభలు నిర్వహించాల్సిందిగా మావోయిస్టు పార్టీ పిలుపునిచ్చింది విధితమే. మావోయిస్టు పార్టీ ఇచ్చిన పిలుపుతో అప్రమత్తమైన తెలంగాణ పోలీసులకు విజయం లభించింది. ఆదివారం నాటి ఎన్కౌంటర్లో రాష్ట్ర కమిటీకి ప్రాతినిధ్య వహిస్తున్న
 కుర్సం మంగు @ భద్రు @ పాపన్న, సెక్రటరీ యెల్లందు - నర్సంపేట ఏరియా కమిటీల సెక్రటరీ తో పాటు రాష్ట్ర బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మరో ముఖ్య నాయకుడు పెద్దపెల్లి జిల్లా రానాపూర్ నుండి 25 ఏళ్ల క్రితం పార్టీలోకి వెళ్లిన ఏగోలపు మల్లయ్య @ మధు,కార్యదర్శి ఏటూరునాగారం మహదేవ్‌పూర్ డి వి సి ఎం, చతిస్గడ్ లో చాలా కాలం పని చేసి ఇటీవలనే తెలంగాణకు ఈ ఎన్కౌంటర్లో ఇద్దరు కీలక నేతల వద్ద రెండు ఏకే-47 రైఫిల్ లభించింది. ఇద్దరు కీలక నేతలపై ఒక్కొక్కరి తలపై సుమారు 25 లక్షల రివార్డు ఉన్నట్లు ప్రచారం. ముస్సాకి దేవల్ @ కరుణాకర్,ముస్సాకి జమున, ఇద్దరు ఏరియా కమిటీ సభ్యులు. మిగిలిన ముగ్గురు జైసింగ్, పార్టీ సభ్యుడుకిషోర్, పార్టీసభ్యుడు.కామేష్, పార్టీ సభ్యుడిగా పోలీసులు నిర్ధారించారు. పౌర హక్కుల సంఘం నాయకులు మాత్రం ఏడుగురికి ఇన్ ఫార్మర్ ద్వారా మిషన్నిండిన ఆహారాన్ని పంపించి ఈ తెల్లవారుజామున ప్రాణాలతోపట్టుకొని చిత్రహింసలు పెట్టి హతమార్చినట్లు పౌర హక్కుల సంఘం నాయకులు ప్రెస్ మీట్ పెట్టి వెల్లడించారు. ఈమెరకు సోమవారం పౌర హక్కుల సంఘాలు, విప్లవ రచయితల సంఘాల నాయకులు బంధుమిత్రుల కమిటీ నాయకులు హైకోర్టును ఆశ్రయించారు. ప్రాణాలతో పట్టుకొని చిత్రహింసలు పెట్టి ఎన్కౌంటర్  చేసేశారని.. మృతదేహాలకు రీపోస్టుమార్టం గురించి సిట్టింగ్ జడ్జి న్యాయ విచారణ చేయించాలని జరపల్సిందిగా మృతుల కుటుంబీకులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు సోమవారం సాయంత్రం వరకు హైకోర్టు ఆదేశాల కోసం ఎదురుచూస్తున్నారు.

ఏగోలపు మల్లయ్య ఎందుకు వచ్చారు.!?

ములుగు జిల్లాలో గత వారం రోజుల క్రితం ఇద్దరు వ్యక్తులను ఇన్ఫార్మల్గా భావించి మావోయిస్టు పార్టీ హతమార్చింది విధితమే. దండకారణ్యంలో ముఖ్య నాయకుడిగా ఉన్న కమలాకర్ వచ్చి ఎన్కౌంటర్ బారిన పడ్డారని భావిస్తున్నారు. ఈ సంఘటన తర్వాత పోలీసులు అప్రమత్తమై చుట్టుపక్కల గ్రామాల్లో తీవ్రమైన నిఘా ఏర్పాటు చేశారు ఫలితంగా మావోయిస్టు పార్టీ దళాన్ని వలవేసి హతమార్చినట్లు ఆ ప్రాంతంలో వినవస్తుంది. మరణించిన ఏడుగురిలో మధు అలియాస్ కమలాకర్ మాత్రమే తెలుగువాడు పెద్దపెల్లి జిల్లాకు చెందినవారు ఇక మిగిలిన ఆరుగురు చత్తీస్గడ్ ప్రాంతంలోని ఆదివాసి కుటుంబాలకు చెందిన వారు అక్కడ నుండి పార్టీలో చేరి తెలంగాణ ప్రాంతంలో మావోయిస్టు కార్యకర్తలుగా వచ్చి ఇక్కడి ఎన్కౌంటర్లో హతమయ్యారు మరణించిన ఆరుగురు ఆదివాసి కుటుంబాలకు చెందిన వారు కావడం విశేషం..

--చత్తీస్గడ్ లో గ్యాప్ తెలంగాణలో భారీ ఎన్కౌంటర్.!!

చత్తీస్గఢ్లో మహారాష్ట్రలో మాదిరిగా తెలంగాణలో రెండు భారీ ఎన్కౌంటర్లు అనతి కాలంలోనే చోటు చేసుకున్నాయి . వారం రోజుల నుండి ఛత్తీస్గఢ్లో అక్కడ సైనికులు గ్యాప్ ఇచ్చినట్టు కనిపిస్తుంది ఈ సమయంలోనే తెలంగాణలో భారీ ఎన్కౌంటర్ జరగడం విశేషం.భద్రాద్రి జిల్లాలో ఐదుగురు ఎన్కౌంటర్ మరవక ముందే తిరిగి ములుగు జిల్లాలో ఎన్కౌంటర్ చోటు చేసుకోవడం ఇక్కడ ఏడుగురు మరణించడం కలకలంరేప్తుంది. పదేళ్ల కాలంతో పోల్చుకుంటే పది నెలల కాలంలోనే ఎన్కౌంటర్లు అధికమయ్యాయి అడవి ప్రాంతాలకు పరిమితమైన మావోయిస్టు పార్టీ దళాలు మైదాన ప్రాంతం మాదిరిగా ఎన్కౌంటర్లలో నేలకొరిగిపోతున్నాయి. మైదాన ప్రాంతం వలే అడవులు విస్తరించిన ములుగు భద్రాద్రి లాంటి జిల్లాలను మావోయిస్టు రహిత జిల్లాలుగా మార్చేందుకు పోలీసులు గట్టిగా ప్రయత్నిస్తున్నారు..IMG-20241202-WA0004

Tags: