భక్తి శ్రద్ధలతో ధర్మపురిలో గోదావరి మహా హారతి
భక్తి శ్రద్ధలతో ధర్మపురిలో
గోదావరి మహా హారతి
...........................
పాల్గొన్న విప్ లక్ష్మణ్ కుమార్
.............................
రామ కిష్టయ్య సంగన భట్ల...
............................
కార్తీక బహుళ అమావాస్య పర్వదిన సందర్భంగా, ధర్మపురి క్షేత్రంలో గోదావరి నది వద్ద కార్తీక దీపారాధనా మహోత్సవం ఆదివారం రాత్రి నేత్ర పర్వంగా జరిగింది. కార్తీక మాస చివరి రోజైన అమావాస్య అపురూప సన్నివేశ నేపథ్యంలో దేవస్థాన ఆస్థాన వేదపండితులు బొజ్జా రమేశ శర్మ రూపశిల్పిగా, వినూత్నంగా క్షేత్రంలో ఏర్పాటు చేసిన, అరుదైన, అపురూప ఆ సన్నివేశ సందర్భంగా ఆది వారం సాయంత్రం 4 గంటల నుండి శ్రమించి ఏర్పాటు చేసిన వేలాది దీపాలంకరణలకు అనూహ్య స్పందన లభించింది. వేద పండితులు, అర్చకులు, సిబ్బంది నిర్వహించగా, మహిళలు, దీపాల అలంకరణకు సహకరించారు. అమావాస్య రాత్రి మునుముందుగా గోధూళి ముహూర్తాన దేవస్థానం ఇఓ శ్రీనివాస్ దర్శకత్వంలో, హారతి భక్తులు దేవస్థానం వద్దనుండి మంగళ వాద్యాలు తోడు రాగా
కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ ప్రత్యేక పూజాదులలో పాల్గొని నదీమ తల్లికి సంప్రదాయ రీతిలో మహా హారతి సమర్పించారు.
మునుముందుగా గోధూళి ముహూర్తాన దేవస్థానం ఇఓ శ్రీనివాస్ దర్శకత్వంలో, ఆస్థాన వేద పండితులు భజ్జా రమేశ శర్మ, అర్చకులు నేరేళ్ళ శ్రీనివాసాచార్య, ప్రవీణ్, సంతోష్, సూపరింటెంట్ కిరణ్, సీనియర్ అసిస్టెంట్ అలువాల శ్రీనివాస్, దేవస్థానం వివిధ ఆలయాల అర్చకులు, మహిళలు, సువాసినులు, సిబ్బంది
ప్రత్యేక పూజలొ
నరించి మంగళ హారతి, మంత్ర పుష్ప నీరాజనాది క్రతువులు నిర్వహించిన అనంతర సనాతన సాంప్రదాయ రీతిలో నది నీటిలో కార్తీక దీపాలను దొప్పలలో వెలిగించి వదిలి పెట్టారు.
అభివృద్ధిలో సహకరించాలని మొక్కుకున్నా
ధర్మపురి క్షేత్రం దేవస్థానం అభివృద్ధిలో స్థానికుల సహకారం సంపూర్ణంగా ఉండేలా చూడాలని గోదావరి మాతకు మొక్కుకున్నానని విప్ లక్ష్మణ్ కుమార్
అన్నారు. కార్యక్రమాల నిర్వహణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరిన సందర్భంలో విప్ ఈ విధంగా స్పందించారు.
ముగిసిన కార్తీక మాసోత్సవాలు
పుణ్య తీర్ధము, ప్రాచీన క్షేత్రమైన ధర్మపురిలో కార్తీక మాసోత్సవ వేడుకలు ఘనంగా ముగిసాయి. చివరి రోజైన ఆది వారం గోదావరిలో కార్తీక మాస ముగింపు సందర్భంగా అత్యధిక సంఖ్యాకులైన భక్తులు, యాత్రికులు పవిత్ర నదీ స్నానాలకై తరలి వచ్చారు. ప్రధానంగా కార్తీక మాస చివరి రోజు, అమావాస్య నాడు సుదూర ప్రాంతాల నుండి ఆర్టీసీ బస్సులు మరియు ప్రైవేటు వాహనాలలో భక్తులు అరుదెంచారు. కార్తీక మాసంలో నదీ స్నాన
మాచరిస్తే నరక బాధలుండవనే విశ్వాసంతో నెల రోజుల ఉదయాత్పూర్వ స్నానాలకు ముగింపు పలికేందుకు, చివరి రోజు ఉదయాత్పూర్వం నుండే పిల్లా పాపలతో, గోదావరి నదిలో మంగళ స్నానాలు ఆచరించి, దీపా రాధనగావించి, దొప్పలలో దీపాలను వెలిగించి, నదినీటిలో వదిలి పెట్టారు. నదీమ తల్లికి మొక్కులు చెల్లించు కున్నారు. శివాలయంలో రావిచెట్టుకు పూజలు చేశారు. ప్రధానాలయాలలో ఈ సందర్భంగా ఉదయం పంచోపనిష యుక్త అభిషేకాలు, ప్రత్యేక అర్చనలు, పూజలు, నిత్య కళ్యాణ అది కార్యక్రమాలు, నిత్య కళ్యాణ దాతల పేరున అర్చనలు, షోడశోపచార విధివిధాన పూజలు నిర్వహించగా, భక్త జనం ప్రత్యేక పూజులలో పాల్గొన్నారు. దేవస్థానం ఎసి, ఇఓ శ్రీనివాస్, ఆస్థాన వేడ పండితులు, రమేశ శర్మ, అర్చక పౌరోహితులు ప్రవీణ్ శర్మ,
సంతోష్ శర్మ, సంపత్ కుమార శర్మ, రాజగోపాల్ శర్మల సహకారంతో ఆలయాల అర్చకులు వేదోక్త సాంప్రదాయ రీతిలో పూజలను నిర్వహించారు. వేద పండితులు, అర్చకులు, నాయకులు, పాల్గొన్నారు.