నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాలు కలించడమే లక్ష్యంగా మెగా జాబ్ మేళా ఎస్పి అశోక్ కుమార్

నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాలు కలించడమే లక్ష్యంగా మెగా జాబ్ మేళా ఎస్పి అశోక్ కుమార్

నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాలు కలించడమే లక్ష్యంగా మెగా జాబ్ మేళా ఎస్పి అశోక్ కుమార్ 


జగిత్యాల 

జగిత్యాల జిల్లాలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా.పాల్గొన్న ఎస్పీ అశోక్ కుమార్....


 నిరుద్యోగ యువతీ యువకులకు 2000 పైగా ఉద్యోగ అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా మెగా జాబ్  మేళ నిర్వహించామన్నారు జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్... జగిత్యాల పట్టణంలో ఏర్పాటు చేసిన జాబ్ మేళాను జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం స్టాల్స్ ని సందర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ జాబ్ మేళాలో  ఐటి , నాన్ ఐటీ , బ్యాంకింగ్, ఫార్మసీ వంటి రంగాలకు చెందిన 50 కంపెనీలు పాల్గొన్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన నిరుద్యోగ యువతి, యువకులు పాల్గొనగా కంపెనీలు పలువురిని ఎంపిక చేసుకున్నాయి. 

 ఈ సందర్భంగా జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ మాట్లాడుతూ జిల్లాలోని నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడానికి 50 కంపెనీలతో మెగా జాబ్ మేళా నిర్వహించామని తెలిపారు. ఈ జాబ్ మేళా ద్వారా 2000 మందికి ప్రైవేట్ మరియు కార్పొరేట్ కంపెనీలలో ఉద్యోగాలు లభిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. 10వ తరగతి నుండి పీజీ వరకు ఉద్యోగాలు ఉన్నాయని తెలిపారు. ఎంతో మంది యువత ఉద్యోగాలు లేకా ఇబ్బంది పడుతున్నారని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఉద్యోగం ఎక్కడ వచ్చిన వెళ్లి జాయిన్ కావాలని తరువాత గ్రోత్ అదే వస్తుందని చూచించారు. జాబ్ మేళాకు  ఐటి, నాన్ ఐటీ, మార్కెటింగ్, సేల్స్ అండ్ సర్వీసెస్, బ్యాంకింగ్, ఫార్మసీ వంటి కంపెనీలు వచ్చాయని చెప్పారు. 

ఈ  కార్యక్రమంలో అదనపు ఎస్పీ  భీమ్ రావు, డిఎస్పిలు రవీంద్ర కుమార్, రఘు చందర్, రాములు, జగిత్యాల టౌన్ సీఐ, వేణుగోపాల్, ఇతర సిఐలు, ఎస్సైలు
లు  పాల్గొన్నారు.IMG-20241211-WA0000

Tags: