గంజాయి విక్రయిస్తున్న ముగ్గురి ఆరెస్ట్
గంజాయి విక్రయదారుల పట్టివేత
చురకలు విలేకరి ఇబ్రహింపట్నం నవంబర్ (19)
ఇబ్రహీంపట్నం మండలంలోని బండలింగాపూర్ క్రాస్ రోడ్ వద్ద వాహనములను తనిఖీ చేయుచుండగా ఒక నంబర్ లేని పల్సర్ బండి పై ముగ్గురు వ్యక్తులు వచ్చుచుండగా వారిని ఆపి తనిఖీ చేయవ వారి బండిలో ఒక నల్లని కవర్లో గంజాయి కలదు వారిని మేము విచారించగా వారు లోకిని వంశీ మరియు కోయల్ కార్ రమేష్ మరియు లోకిని విగ్నేష్ మెట్ పల్లి నివాసులమని తెలిపి మేము నిన్న సాయంత్రం మోటార్ సైకిల్ పై మెట్ పల్లి నుండి నిజామాబాద్ వెళ్లి అచ్చట రైల్వే స్టేషన్ వద్ద మా యొక్క వాహనమును పెట్టి నాందేడ్ కు వెళ్లి అచ్చట గతంలో పరిచయం ఉన్న అజార్ అనే వ్యక్తి వద్దకు వెళ్లి అతని వద్ద కొంత గంజాయిని కొనుక్కొని మెట్పల్లికి తీసుకొని వచ్చి అతి గంజాయిని చిన్న చిన్న ప్యాకెట్లుగా తయారు చేసి ఒక ప్యాకెట్ కు 500 రూపాయల చొప్పున అమ్ముదామని వచ్చుచుండగా పోలీసు వారు మమ్ములను ఆపి సోదా చేయగా ఇట్టి గంజాయి దొరికినాదని పంచుల సమక్షంలో చూపించగా అట్టి గంజాయిని స్వాధీనపరచుకొని నిందితులను అదుపులోనికి తీసుకొని పంచుల సమక్షంలో అట్టి గంజాయిని తూకం వేసి చూడగా సుమారు 220 గ్రాములు వున్నది మరియు వారి వద్దనున్న మూడు సెల్ ఫోన్ లను వారు వాడిన బైకును స్వాధీనపరచుకొని ఈ- సాక్ష ద్వారా రికార్డు చేసి నిందితులను అదుపులోనికి తీసుకొని ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్కు వచ్చి అట్టి నిందితులపై కేసు నమోదు చేసి తదుపరి చర్య నిమిత్తంమెట్ పల్లి సిఐ నిరంజన్ రెడ్డి, ఎస్ ఐ అనిల్ కోర్టులో హాజరు పరిచారు. ఇకనుండి ఈ ప్రాంతంలో ఎవరైనా వ్యక్తులు ఎంతటి వారైనా గంజాయిని కానీ మరియు ఏ ఇతర మత్తు పదార్థాలు గానీ అమ్మిన గాని సేవించిన గాని కఠినంగా శిక్షింపబడుతామని తెలుపుచున్నాము .