పాస్ పోర్ట్ కొరకు ఆందోళన

పాస్ పోర్ట్ కొరకు ఆందోళన

పాస్పోర్ట్ కొరకు ఆందోళన

చురకలు విలేఖరి 
జగిత్యాల, డిసెంబర్,21

ఉన్న ఊరు కలిసి రాక ఉపాధి లేక చాలా ప్రాంతాల నుంచి ప్రజలు గల్ఫ్ కు పొట్టకూటి కోసం వెళ్తున్నారు.. ఇదే అదనుక భావిస్తున్న కొందరు ఏజెంట్లు మోసలకు పాల్పడుతున్నారు. మంచి ఉద్యోగం అంటూ మాయమాటలు చెప్పి జీవితాలను ఎడారిపాలు చేస్తున్నారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణానికి చెందిన చాన్న శివ కుమార్ గత మూడు నెలల క్రితం జిల్లా కేంద్రంలోని కార్తీక్ ఇంటర్నేషనల్ వారు వారం రోజుల్లోనే వీసా వస్తుందని దుబాయ్ కొరకు మంచి ఉద్యోగం ఉందని నమ్మించి ఒరిజినల్ పాస్ పోర్ట్ తీసుకొని గత మూడు నెలలు వీసా కూడా రాకపోవడంతో విసిగి వేసారి పైన బాధితుడు శివ పలుమార్లు కార్తిక్ ఇంటర్నేషనల్ ఆఫీసుకు తిరిగి తమ పాస్ పోర్ట్ ఇవ్వమని కోరగా 20 వేలు డిమాండ్ చేశారు. దీంతో బాధితుడు మెట్పల్లి పట్టణ యం, ఐ, యం,అధ్యక్షుడు అఖిల్, జగిత్యాల మున్సిపల్ కౌన్సిలర్ రజియోద్దీన్ తో కలిసి కార్తీక్ ఇంటర్నేషనల్ కార్యాలయంలో ఆందోళనకు దిగారు.. కార్యాలయంలో ఉన్న వారిని నిలదీయడంతో  సోమవారం తమ పాస్ పోర్ట్ తిరిగి ఇస్తామని తెలపటంతో గొడవ సద్దుమణిగింది.IMG-20241221-WA0000

Tags: