కరీంనగర్ మిల్క్ డైరీలో ఫంగస్ వచ్చిన మిల్క్ కేకులు
కరీంనగర్ మిల్క్ డెయిరీ లో
ఫంగస్ వచ్చిన మిల్క్ కేకులు
సీజ్ చేసిన ఫుడ్ ఇన్స్పెక్టర్
జగిత్యాల జిల్లా కేంద్రంలోని కరీంనగర్ మిల్క్ డెయిరీ పై ఫుడ్ ఇన్స్పెక్టర్ అనూష దాడులు నిర్వహించారు. ఈ నెల 3 న షఖీల్ అనే వినియోగదారుడు ఇక్కడ మిల్క్ కేకు కొనుగొలు చేసి ఇంటికి వెళ్లి చుడగా ఫంగస్ ఉన్నట్టు గుర్తించి షాప్ నిర్వాహకులకు తెలిపాడు .వారు నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడంతో ఫుడ్ ఇన్స్పెక్టర్ కు ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు ఫుడ్ ఇన్స్పెక్టర్ అనూష కరీంనగర్ మిల్క్ డెయిరీ పై దాడులు నిర్వహించి 20 బి బ్యాచ్ నంబర్ గల మిల్క్ కేకు లను సీజ్ చేశారు. అనంతరం మాట్లాడుతూ జగిత్యాలలో కరీంనగర్ మిల్క్ డెయిరీ పాయింట్లు 8 ఉన్నాయని వాటిలో కూడా ఈ బ్యాచ్ నంబర్ గల మిల్క్ కేకులను విక్రయించరాదని తెలిపారు.ఈ కేకులు తయారు చేసే ఫ్యాక్టరీకి దుకాణాల్లో కాలం చెల్లిన కేకులు వాపస్ చేస్తే వాటి లేబుల్ లను మార్చి మల్లి దుకాణాలకీ పంపడం వల్ల ఇలాంటి సంఘటనలు జరుగుతుంటాయాని వివరించారు.