పి ఎల్ జి ఏ వారోత్సవాలను విజయవంతం చేయండి మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి జగన్
పి ఎల్ జి ఏ 24 వ వార్షిోత్సవాలను విజయవంతం చేయండి
మావోయిస్ట్ పార్టి తెలంగాణ రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి జగన్
చురకలు ప్రత్యేక ప్రతినిధి
డిసెంబర్ 2 నాటికి పి ఎల్ జి ఏ (ప్రజా విముక్తి గెరిల్లా సైన్యం)నికి 24 సంవత్సరాలు నిండుతాయనీ,24 సంత్సరాల వార్షికోత్సవలను పురష్కరించుకొని డిసెంబర్ 2 నుండి 8 వరకు పిఎల్టీఏ వార్షికోత్సవాలను రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ, మైదాన, పట్టణ ప్రాంతాల్లో విప్లవోత్సహాంతో జరపాల్సిందిగా రాష్ట్రంలోని విప్లవ ప్రజలకు, పార్టీ శ్రేణులకు, పార్టీ కమిటీలకు తెలంగాన రాష్ట్ర కమిటీ తరపున ఆ పార్టి అధికార ప్రతినిధి జాగన్ పేరుతో సోమవారం విడుదల చేసిన ప్రకటనలో కోరారు.
దేశంలో నూతన ప్రజాస్వామిక విప్లవ విజయ సాధన కోసం ప్రజా యుద్ధం కొనసాగిస్తున్న పార్టీ, పిఎల్ జి ఏ తెలంగాణలో శతృవు
కల్పించిన ప్రతికూల పరిస్థితుల నడుమ విప్లవోద్యమ ప్రజా పునాదిని బలోపేతం చేయడానికి గత సంవత్సర కాల రాజకీయ, నిర్మాణ,
కృషిలో భాగమైన పిఎల్ జి ఏ, పార్టీ కమిటీలకు, శ్రేణులకు విప్లవ ప్రజానికానికి, సంఘాలకు, నాయకులకు, కార్యకర్తలకు, ఆర్పీసీలకు,
మిలిషియాలకు, అరెస్టు అయి భౌతికంగా, మానసికంగా వేధింపులను దిక్కరించి, మొక్కవోని దీక్షతో దుర్భర జైలు జీవితాన్ని అనుభవిస్తున్న విప్లవకారులకు తెలంగాణ రాష్ట్ర కమిటీ తరుపున మనస్ఫూర్తిగా విప్లవాభివందనాలు తెలుపు తున్నట్లు జగన్ పేర్కోన్నారు. బ్రాహ్మణీయ ,హిందుత్వ ఫాసిస్టులు, విప్లవ ప్రతిఘాతక సూరజ్ కుండ్ వ్యూహాత్మక పథకంలో భాగంగా కగార్ ఆపరేషన్
పేరుతో కొనసాగిస్తున్న శతృవు దుష్ట పథకానికి తలవంచక భీకర యుద్ధాన్ని త్యాగ నీరితితో, అసమాన ధైర్యసాహాసాలతో ప్రతిఘటిస్తూ
పిఎల్ జిఏ వార్షిక సంవత్సరంలో దేశ వ్యాప్తంగా 254 మంది వీర గెరిల్లాలు తమ ప్రాణాలను తృణప్రాయంగా అర్పించారనీ జగన్ పేర్కోన్నారు.తెలంగాణ
విప్లవోద్యమ కృషిలో పార్టీ కమిటీ కార్యదర్శి, కమాండర్ సాగర్, జిల్లా కమిటీ సభ్యులు లచ్చన్న, మంగు, వర్గేష్, ఏరియ కమిటీ సభ్యులు తులసీ, రాము, మణిరామ్ సీనియర్ పార్టీ సభ్యులు విజెందర్, వర్గేష్, కోసి, గంగాల్, బుద్రు, రాజులు 13 మంది కామ్రేడ్స్ అమరులయ్యారనీ జగన్ పేర్కొన్నారు. దళిత, ఆదివాసీ, మత మైనార్టీ, పీడిత ప్రజల ప్రజాస్వామిక హక్కల కోసం దృఢంగా నిలిచి పోరాడిన కామ్రేడ్
సాయిబాబా 15 అక్టోబర్ కన్నమూశారని ,విప్లవోద్యమ కృషిలో తమ అమూల్యమైన ప్రాణాలు అర్పించిన వీర యోధులకు తెలంగాణ
రాష్ట్ర కమిటీ తలవంచి వినమ్రంగా జోహార్లు అర్పిస్తున్నట్లు, తెలంగాణలో తమ పార్టీ తాత్కలిక వెనకంజ వేసి అనేక ప్రతికూలతలను ఎదొర్కొంటుందనీ పేర్కోన్నారు. మావోయిస్టు నిర్మూలన కోసం
శతృవు, సెక్యూరిటీ క్యాంపులు ఏర్పారచారని ,రోడ్లు, కమ్యూనికేషన్, హ్యూమన్, సాంకేతిక నిఘా వ్యవస్థ, వందలాది శతృవు పోలీసు బలగాల కూంబింగ్ లు, దాడులు విప్లవోద్యమ పరోగమనాననికి ఆటంకంగా మారాయనీ ,అయిన్పటికీ దృఢ సంకల్పంతో ప్రతికూలతలను
అధికమించి అనేక త్యాగాలు చేస్తూ పార్టీ, పిఎల్ జీ ఏ నిలదొక్కుకుంటుందనీ పేర్కోన్నారు.శక్తి మేరకు గెరిల్లా యుద్ధాన్ని కొనసాగిస్తున్నదనీ,రాజకీయ, నిర్మాణ, సైనిక కృషిలో ప్రజా ఉద్యమాలకు నాయకత్వం వహిస్తుందనీ ,మత మైనార్టీలపై, మహిళలపై, దళితులపై,
ఆదివాసీలపై భారత ప్రజలపై కొనసాగుతున్న బ్రాహ్మణీయ హిందుత్వ పాశవిక దాడుల నుండి దేశాన్ని రక్షించడానికి అనేక ప్రచార ఆంధోళన కార్యక్రమాలు చేపట్టిందనీ జగన్ పేర్కోన్నారు.భీష్మ యుద్ధం కగార్ ఆపరేషన్ ను ప్రతిఘటిస్తూనే రాజకీయ ఆంధోళనలు చేపట్టిందనీ ,పట్టణ, మైదాన, అటవి ప్రాంతాల్లో సామ్రాజ్యవాద, దళారీ నిరంకుశ, భూస్వామ్య వ్యతిరేక, కార్పోరేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేపట్టిందనీ,సింగరేణి ప్రవేటీకరణకు వ్యతిరేకంగా విరోచిత పోరాటాల వైపు కార్మికులను కదిలించిందని,దోపిడి వర్గాల ప్రయోజనాల కోసం కాలరాస్తున్న పౌర ప్రజాస్వామిక హక్కుల పరిరక్షణ కోసం పోరాటాలు చేపట్టిందని,. జల్, జంగల్,జమీన్, అధికారం, ఆస్థిత్వం
కోసం చేస్తున్న ఆదివాసీల పోరాటాలకు నాయకత్వం వహించిందనీ ,అన్ని రంగాల ప్రజల మౌళిక సమస్యల పరిష్కారానికి అండగా నిలబడుతూనే ప్రజల రాజకీయాధికార కల సాధికారతకు గ్యారంటీనిస్తుందనీ పేర్కోన్నారు.ఈ ప్రజాందోళల నుండి వర్గ పోరాటాన్ని, ప్రజాయుద్ధాన్ని పెంపొందించాల్సిన అవసరం వుందనీ,బ్రాహ్మణీయ హిందుత్వ పాలకులు దేశ వ్యాప్తంగా మావోయిస్టు పార్టీ నిర్మూలన కోసం విప్లవ ప్రతిఘాతక సూరజ్ కుండ్ వ్యూహాత్మక పథకం అమలులో భాగంగా ఆపరేషన్ కగార్ చేపట్టి భయంకరమైన నరసంహార యుద్ధాన్ని కొనసాగిస్తున్న విషయం ప్రజలందరికి తెలిసిందే ఆని. 2024 వరకు బ్రాహ్మణీయ హిందుత్వ రాజ్యాన్ని నిర్మించడమే ప్రధాన లక్ష్యంగా బీకర యుద్దాన్ని
కొనసాగిస్తున్నారనీ,హిందుత్వ రాజ్యం కల సాధికత కోసం వికసిత్ భారత్ అని అంటున్నారాని,. ఆర్ఎస్ఎస్, బీజేపిల లక్ష్యానికి అడ్డంకిగా
మారిన సంస్థలను, శక్తులను నిర్మూలిస్తున్నారాని, కమ్యూనిస్టు భావజాలాన్ని, ముఖ్యంగా మావోయిస్టు భావజాలాన్ని తుడిచి పెట్టాలని
కర్తవ్వం పెట్టుకున్నారని, హిందుత్వ వ్యతిరేక భావజాల సెక్యులర్ శక్తులను అర్బన్ నక్సలైట్స్ అనే ముద్ర వేసి అణిచివేస్తున్నారని, ప్రశ్నించే
ప్రజాస్వామిక శక్తుల గొంతుకలను నులిమి వేస్తున్నారనీ, తెలంగాణలో ఆర్ఎస్ఎస్, బీజేపిల లక్ష్యాన్ని పరిపూర్తి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కంకణం కట్టుకుని పని చేస్తుందనీ జగన్ పేర్కోన్నారు.
సామ్రాజ్యవాదుల,
దళారీ ,నిరంకుశ ,బూర్జువా, భూస్వామ్య, కార్పోరేట్ల లాభాల పల్లకిని భుజానికెత్తుకొని మోస్తున్నదనీ ,రాష్ట్రాన్ని కార్పోరేట్లకు కట్టపెట్టడానికి
ఆర్ధిక అభివృద్ధి పేరుతో సులభతర వాణిజ్య విధానం అమలు చేస్తూ కార్పోరేట్ సంస్థల విస్తృత పెట్టుబడులను ఆహ్వానిస్తున్నదనీ,పర్యావరణాన్ని దెబ్బతీసే గనులను, పర్యాటక కేంద్రాలు, ఫార్మాసిటి, నేవి రాడార్ వంటి వినాషకార అభివృద్ధిని తీవ్రతరం చేస్తున్నదనీ, సింగరేణి బొగ్గు గనులను ప్రవేటీపరం, అడవుల కార్పోరేటీకరణ, భూముల కార్పోరేటీకరణ, వ్యవసాయ, సేవా, పారిశ్రామిక రంగాల
కార్పోరేటీకరణ ఇలా సర్వం దేశీయ, విదేశీ దోపిడి వర్గాలకు అప్పగిస్తున్నదనీ జగన్ పేర్కోన్నారు.ప్రజలకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి కార్పోరేట్ల ప్రయోజనాల కోసం దోపిడి అనుకూల విధానాలను దూకుడుగా అమలు చేస్తుందనీ, పౌర ప్రాధమిక హక్కులను, జీవించే హక్కును కాలరాస్తున్నదని ,కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని చేపట్టిన సంవత్సర కాలంలో శతృవు సాయుధ బలగాల ద్వారా కర్రెగుట్ట, రఘునాధపాలెం, దామెరతోగు అడవుల్లో దళాలపై దాడులు చేయించి 10 మంది విప్లకారులను పొట్టన పెట్టుకుందనీ,జూన్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,
ఉప ముఖ్య మంత్రి బట్టి విక్రమార్కలు ,కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిసి మావోయిస్టు పార్టీ నిర్మూలిన కొరకు మావోయిస్టు ప్రభావిత
ప్రాంతాలకు బడ్జెట్ తో పాటు, ప్రత్యేక టాస్క్ పోర్స్ ను కెటాయించాలని కోరారని జగన్ పేర్కొన్నారు. ఆగస్టు 24 నాడు చత్తీష్ గడ్ రాష్ట్ర రాజధాని రాయ్ పూర్ లో జరిగిన సమావేశానికి, అక్టోబర్ 7న న్యూఢిల్లీలో జరిగిన వార్షిక సమావేశానికి రాష్ట్రం నుండి హాజరవుతూ 2026 మార్చి నాటికి మావోయిస్టు పార్టీని నిర్మూలించాలనే దుష్ట పథకాన్ని అమలు చేయడానికి పూనుకుంటున్నారని,నేడు కేంద్ర, రాష్ట్ర ఫాసిస్టు దోపిడి పాలకులంతా కుమ్మకై 2026 మార్చి వరకు డెడ్ లైన్ లు ప్రకటించి తీవ్రమైన అణిచివేత ప్రయోగిస్తున్నారని, దేశ వ్వాప్తంగా విప్లవోద్యమ ప్రాంతాలంతటా కార్పెట్ సెక్యూరిటీ వ్యవస్థ సంఘటితపడి విప్లవోద్యమ ప్రాంతాలు దెబ్బతిని
తాత్కలికంగా వెనకంజ వేసిన మాట వాస్తవమే అయినప్పటకీ దేశంలో, రాష్ట్రంలో రోజు రోజుకు పీడిత ప్రజలపై, ప్రత్యేకించి మహిళలపై, మత మైనార్టీలపై, దళితులపై, ఆదివాసీలపై దోపిడి దౌర్జన్యాలు, అణిచివేత తీవ్రమవుతూనే వున్నాయని జగన్ పేర్కోన్నారు.దోపిడి పీడినలు వున్నంత కాలం విప్లవాలను శాశ్వతంగా అణిచివేయడం అసాధ్యం అని,
విప్లవ ప్రతిఘాతక సూరజ్ కుండ్ వ్యూహాత్మక పథకాన్ని విఫలం చేయాలని,ఆపరేషన్ కగార్ దాడిని ప్రతిఘటిస్తూ అసువులు బాసిన అమరుల త్యాగాలు, అసమాన ధైర్యసాహాసాలు అనుసరణీయమైనదనీ ,అమరులు స్ఫూర్తి దృఢంగా పోరాడాలని , ప్రజా విముక్తి గెరిల్లా సైన్యం సాధించిన విజయాల ఉత్సాహాంతో 24వ పిఎన్జీఏ వార్షికోత్సవాలను జరుపుకుందాం అని గెరిల్లా యుద్దం ద్వారా కగార్ దాడులను తిప్పికొడుతూ పార్టీని, పిఎల్జీఏను రక్షించుకుందమని అధికార ప్రతినిధి జగన్ ప్రకటనలో కోరారు.