ఎన్ కౌంటర్లో మృతి చెందింది ఏగోలపు మల్లయ్యనే...! నిర్ధారించుకున్న కుటుంబ సభ్యులు..
ఎన్ కౌంటర్లో మృతి చెందింది
ఏగోలపు మల్లయ్యనే.!
నిర్ధారించుకున్న కుటుంబ సభ్యులు..
చురకలు ప్రతినిధి కమాన్ పూర్ డిసెంబర్ 2. ములుగు జిల్లా ఏటూరు నాగారంలో మృతి చెందింది ఏ గోలపు మల్లయ్య అని ఆయన సోదరులు నిర్ధారించుకొని గుర్తుపట్టారు. ఎటునాగారంలో భారీ ఎన్కౌంటర్ జరగా ఉమ్మడి కమాన్ పూర్ ప్రస్తుత పాలకుర్తి మండలం రానాపూర్ గ్రామానికి చెందిన మృతి చెందినట్లు ఆదివారం వార్తలు ధారాళంగా వ్యాపించాయి. దీంతో ఆయన కుటుంబ సభ్యులకు మల్లయ్యను గుర్తుపట్టేందుకు రావలసిందిగా పోలీసులు వేటూరి నాగారంకు పంపించారు. సోమవారం ఉదయం మల్లయ్య అన్నలు పేగులకు రాజయ్య ఏ గోలపు లక్ష్మయ్య ఏ గోలపు శ్రీనివాస్ తో పాటు భార్య మీన మరియు గ్రామ మాజీ ఉపసర్పంచ్ బాలగోని కుమార్ గౌడ్ లు ఎన్కౌంటర్ జరిగిన స్థలానికి వెళ్లి మృతి చెందింది ఏ గోలపు మల్లయ్య గా గుర్తించారు. కాగా రీ పోస్టుమార్టంకు కోర్టులో వేయగా కోర్టు ఆదేశాల మేరకు మంగళవారం రి పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని మల్లయ్య కుటుంబ సభ్యులకు అందజేయనున్నారు
కాగా ఇది బూటకపు ఎన్కౌంటర్ గా ఆయన భార్య మీనా ఆరోపించింది. మంగళవారం అంత్యక్రియలు సొంత గ్రామమైన రాణాపూర్ లో జరగనున్నట్లు సమాచారం