హత్యకేసులో నిందితుల లొంగుబాటు

హత్యకేసులో నిందితుల లొంగుబాటు

హత్యకేసులో నిందితుల లొంగుబాటు 

మృతదేహాన్ని కాల్చిన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు 

కేసు వివరాలను వెల్లడించిన ధర్మపురి సీఐ రాంనర్సింహారెడ్డి

చురకలు విలేకరి, ధర్మపురి, డిసెంబర్ 21 : ధర్మపురి మండలం నేరెళ్ల గ్రామంలోని గుట్టలో జరిగిన హత్య కేసులో నిందితులైన ఇద్దరు వ్యక్తులు శనివారం ధర్మపురి పోలీసుల ముందు లొంగిపోయారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని కమలాపూర్ గ్రామానికి చెందిన వేరెళ్ల గోపాల్, వేరెళ్ల గ్రామానికి చెందిన గండికోట శేఖర్ అనే ఇద్దరు
ఉత్తరప్రదేశ్కు చెందిన రాహుల్ సూర్యప్రకాష్ సింగ్ను హత్య చేశారు. కేసు వివరాల్లోకి వెళితే రెండు నెలల క్రితం నేరెళ్ల గ్రామానికి చెందిన మెరుగు లక్ష్మణ్ మరదలును ఇబ్బంది పెడుతున్న తోకల గంగాధర్ను హత్య చేయించడానికి కమలాపూర్ గ్రామానికి చెందిన వేరెళ్ల గోపాల్ను ఆశ్రయించగా. నేరెళ్ల గోపాల్, గండికోట శేఖర్ వారికి పరిచయం ఉన్న ఉత్తరప్రదేశ్కు చెందిన రాహుల్ సూర్యప్రకాష్ సింగ్తో మాట్లాడి తోకల గంగాధర్ను హత్య చేయిస్తామని, తోకల గంగాధరన్ను హత్య చేయడానికి రూ.4లక్షలకు రాహుల్ సూర్య ప్రకాష్ సింగ్ సుపారీ మాట్లాడుకున్నారు. కొన్ని రోజుల తర్వాత తోకల గంగాధర్ హత్య విషయమై మెరుగు లక్ష్మణను నేరెళ్ల గోపాల్ అడుగగా ఎవరిని హత్య చేసే అవసరం లేదని చెప్పడంతో రాహుల్ సూర్యప్రకాష్ సింగ్ తనకు మాట్లాడుకున్న రూ.4లక్షల సుపారీ డబ్బులు నేరెళ్ల గోపాల్ ఇవ్వాలని లేనిపక్షంలో నేరెళ్ల గోపాల్ తండ్రి రమేష్ న్ను చంపేస్తానని రాహుల్ సూర్యప్రకాష్ సింగ్ బెదిరింపు పాల్పడ్డాడు. దీంతో రాహుల్ సూర్యప్రకాష్ సింగ్ను చంపాలనే ఉద్దేశ్యంతో అతనిని ముంబాయి నుండి నేరెళ్లకు రప్పించి నేరెళ్ల గోపాల్, గండికోట శేఖర్లు డిసెంబర్ 13న రాహుల్ సూర్యప్రకాష్ సింగ్ను ఓకారులో నేరెళ్ల సాంబశివుని గుట్ట వద్దకు తీసుకెళ్లి గోపాల్ అక్కడే రాహుల్ సూర్యప్రకాష్ సింగ్ను తలపై బండరాయితో కొట్టి హత్య చేశాడు. హత్య అనంతరం రాహుల్ సూర్యప్రకాష్ సింగ్ మృతదేహాన్ని బట్టపల్లి పోతారం గ్రామ శివారులోని అటవీప్రాంతానికి తీసుకెళ్లి పెట్రోల్ పోసి తగలబెట్టారు. శనివారం నిందితులైన నేరెళ్ల గోపాల్, గండికోట శేఖర్లు రాహుల్ సూర్యప్రకాష్ సింగ్ను తామే హత్య చేశామని వేగాన్ని ఓప్పుకొని పోలీసుల ముందు లొంగిపోయారు. శనివారం సంఘటన స్థలాన్ని ధర్మపురి సీఐ రాంనర్సింహారెడ్డి, ఎస్ఐలు ఉదయ్, శ్రీధర్ రెడ్డిలు పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.IMG-20241221-WA0007

Tags: