సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి డాక్టర్ సిద్ధార్థ కమల్
సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి
ఆర్.ఎం.పి, పి.ఎం.పి అసోసియేషన్ సమావేశంలో
ఎంబిబిఎస్ జనరల్ ఫిజీషియన్ సిద్ధార్థ కమల్
చురకలు విలేకరి ఇబ్రహింపట్నం నవంబర్ (19)
సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సాయి శ్రీనివాస హాస్పిటల్ మెట్ పల్లి డాక్టర్ సిద్ధార్థ కమల్ అన్నారు. మంగళవారం ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలోని ధర్మర స్వామి కళ్యాణ మండపంలో ఏర్పాటుచేసిన ఆర్ఎంపి పిఎంపి అసోసియేషన్ సమావేశానికి ఎంబిబిఎస్ జనరల్ ఫిజీషియన్ సిద్దార్ద కమల్,
డాక్టర్ బెజ్జారపు శ్రీనివాస్ లు హాజరై సీజనల్ వ్యాధుల పట్ల అవగాహన సదస్సు నిర్వహించారు. గ్రామీణ ప్రాంతాలలో ప్రజలతో దగ్గరగా ఉంటూ ప్రజలకు సేవలు అందిస్తున్న ఆర్ఎంపి, పిఎంపీలు ఎప్పటికప్పుడు వ్యాధుల పట్ల అవగాహన పెంచుకోవాలని సూచించారు థైరాయిడ్, బిపి, షుగర్ , జలుబు, దగ్గు, తీవ్ర జ్వరం పట్ల అప్రమత్తంగా ఉండాలని డాక్టర్ సూచనలు చేశారు.అనతరం ఇబ్రహింపట్నం ఎస్ ఐ అనిల్ సమావేశంలో పాల్గొని పలు సుచనలు అందచేశారు. ఈ కార్యక్రమంలో సాయి శ్రీనివాస ఆసుపత్రి నిర్వాహకులు అవుట్ల లక్ష్మణ్, ఆర్ఎంపీ పీఎంపీ అసోసియేషన్ జిల్లా సంయుక్త కార్యదర్శి పెంట లింబద్రి,దాసరి గంగనర్సయ్య,అవుల శ్రీకాంత్,నాగేష్,నర్సయ్య, అశోక్, ప్రసాద్, అనంత్,గోఫి గ్రామీణ ప్రాంత ఆర్ఎంపీ పీఎంపీలు పాల్గొన్నారు.