పి ఎల్ జి ఏ,వారోత్సవాలకు 24 గంటల ముందే ఎన్ కౌంటర్
వారోత్సవాలకు 24 గంటల ముందే ఎన్కౌంటర్
ములుగులో మావోయిస్టులకుమరో భారీ నష్టం.
ఉలిక్కిపడ్డ ఉత్తర తెలంగాణ.
ఇన్ ఫార్మర్ల ఇద్దరి హత్య తిరుగువారం వెళ్లకముందే ఏడుగురి ఎన్కౌంటర్.
మృతుల్లో ఇద్దరు కీలక నేతలు
రానాపూర్ కు చెందిన మల్లేష్@కమలాకర్ మృతి
ఇమ్రాన్ ఎడిటర్
తెలంగాణలో మళ్లీ భారీ ఎన్కౌంటర్ జరిగింది. సోమవారం నుండి రాష్ట్రాల్లో పి ఎల్ జి ఏ వారోత్సవాలుజరపాలిసిందిగా ఆ పార్టీ పిలుపునిచ్చింది వారోత్సవాలకు 24 గంటల ముందే ఇద్దరు కీలక నేతలతో సహా ఏడుగురు సభ్యులు ఎన్కౌంటర్లో నేలకొరిగారు.భద్రాద్రి జిల్లా ఎన్కౌంటర్ మరవకముందే తిరిగి ములుగు జిల్లాలు జరిగిన సంఘటనతో మావోయిస్టు పార్టీ ఒక్కసారి కంగు తింటుంది. గడచిన పదేళ్ల కాలంలో ఏడుగురు నక్సలైట్లు చనిపోవడం ఇదే మొదటిసారి రెండవ భారీ ఎన్కౌంటర్ ఇదే అవుతుంది. టిఆర్ఎస్ పాలనలో సాగర్ శృతి ఎన్కౌంటర్ సహా మరో ఇద్దరు రెండు చోట్ల ఎన్కౌంటర్లు మరణించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన పది నెలల కాలంలోనే మూడు ఎన్కౌంటర్లు చోటు చేసుకోవడం సంచలనం దొరుకుతుంది. అందులో అదివారం ఉదయం జరిగిన ఎన్కౌంటర్లు ఏడుగురు సభ్యులను మావోయిస్టు పార్టీ కోల్పోవడంతో ఉత్తర తెలంగాణ ఒకసారి ఉలిక్కిపాటుకు గురి అయింది. పార్టీలో కొత్త రిక్రూట్మెంట్ లేకపోవడంతో సతమతంతో ఉన్న నాయకత్వం ఉన్న దళాలను ఎన్కౌంటర్లతో కోల్పోవడం ఆ పార్టీకి కోల్కోనీ దెబ్బగా మారింది. శనివారం నాటి ఎన్కౌంటర్లో ఛత్తీస్గఢ్ కు చెందిన కురుసంమంగు అలియాస్ బద్రు తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు గా ఉంటూ నర్సంపేట వరంగల్ ఏరియాలకు ప్రాతినిధ్య వహిస్తున్నారు ఇక పెద్దపెల్లి జిల్లా రానాపూర్ కు చెందిన ఎగోళపు మల్లయ్య అలియాస్ కమలాకర్ పాతికేల్లుగా పార్టీలో క్రియాశీల పాత్ర పోషిస్తున్నారు. చత్తీస్గడ్ దండకారణ్యంలో పనిచేస్తున్న కమలాకర్ తిరిగి తెలంగాణకు వచ్చినట్లు ప్రచారం జరుగుతుంది.
--నాడు మైదానంలో, నేడు దండకారణ్యంలో మావో లకు జారిపోతున్న పట్టు.!!!
2004 శాంతి చర్చల తర్వాత నల్లమల లో తీవ్ర నష్టాలనుండి మావోయిస్టు పార్టీ మిగిలిన కొంతమంది సభ్యులు ఏవోబి ప్రాంతానికి తరలిపోయారు. అదే సమయంలో తెలంగాణ మైదాన ప్రాంతంలో క్రమంగా దళాలను ఎన్కౌంటర్లలో కోల్పోయిన తర్వాత మైదాన ప్రాంతం నుండి దండకారణ్యానికి ఉత్తర తెలంగాణలోని అడవి ప్రాంతానికి పరిమితమయ్యారు.
చతిస్గడ్ లో గడిచిన జనవరి నుండి ముఖ్యంగా నాలుగు నెలలకు జరిగిన ఎన్కౌంటర్లలో తెలంగాణ ప్రాంతానికి చెందిన ముఖ్య నాయకులు మరణిస్తూ వస్తున్నారు. ఇలా మావోయిస్టు పార్టీ ఎదురు దెబ్బలు గురవుతుండగా తాజాగా మళ్లీ ములుగు ప్రాంతంలో జరిగే ఎన్ కౌంటర్ లో ఏడుగురు కోల్పోవడం అటవీ ప్రాంతాల్లో కూడా మావోయిస్టు పార్టీ పట్టు జారిపోతుందని వరుస సంఘటనలే రుజువు చేస్తున్నాయి. ఇకపోతే రెండు నెలల క్రితం భద్రాద్రి జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో మరణించిన నలుగురు ప్రాంతానికి చెందిన వారి కావడం విశేషం ఇప్పుడు తాజా ఎన్కౌంటర్లను మరణించిన ఏడుగురులో ఆరుగురు చత్తీస్గడ్ వాసులు అందులో ఆదివాసి గుత్తి కోయల జాతులకు చెందినవారు ఈ ఎన్ కౌంటర్ లో మరణించడం గమ నించదగ్గ విషయం.
ఆ ఇద్దరిపై 50 లక్షలు రివార్డు..
రాష్ట్ర మంత్రివర్గంలో ప్రాతినిధ్యం వహిస్తున్న సీతక్క అసెంబ్లీ నియోజకవర్గంలోని మారుమూల గ్రామంలో జరిగిన ఆదివారం నాటి ఎన్కౌంటర్లో మొత్తం 7 మంది సభ్యులు మరణించారు.
కుర్సం మంగు @ భద్రు @ పాపన్న, రాష్ట్ర కమిటీ సభ్యులు, సెక్రటరీ యెల్లందు - నర్సంపేటల సెక్రటరీగా పనిచేస్తున్నారు ఆయనపై చత్తీస్గడ్ తెలంగాణ రాష్ట్రాల్లో 25 లక్షల రివార్డు ఉన్నది. మంగు నాయకత్వంలో గతంలో యాక్షన్ టీం నడిపించారు ఎన్కౌంటర్ సమయంలో ఆయన వద్ద
47 రైఫిల్ లభించింది.
ఏగోలపు మల్లయ్య @ మధు @కమలాకర్ పెద్దపెల్లి జిల్లా రానాపూర్ గ్రామానికి చెందినవారు 25 ఏళ్ల క్రితం మావోయిస్టు పార్టీలో చేరారు. దండకారణ్యంలోని ఎక్కువ కాలం పని చేశారు ఇటీవల తిరిగి తెలంగాణకు వచ్చిన ఆయనకు
కార్యదర్శి ఏటూరునాగారం మహదేవ్‌పూర్ ల బాధ్యతలు అప్పగించినట్లు ప్రచారం, కమలాకర్ భార్య అరెస్టు బెల్లంపల్లిలో నివాసం ఉంటుంది కమలాకర్తలపై 25 లక్షల రివార్డు ఉన్నది. ఆయన వద్ద ఏకే-47 రైఫిల్ లభించింది.
3. ముస్సాకి దేవల్ @ కరుణాకర్, ఏరియా కమిటీ సభ్యులు.
4. ముస్సాకి జమున, ఏరియా కమిటీ సభ్యులు.
5. జైసింగ్, పార్టీ సభ్యుడు.
6.కిషోర్, పార్టీ సభ్యుడు
7.కామేష్, పార్టీ సభ్యుడి గా పోలీసులు గుర్తించారు..