బీజేపీ కార్యకర్త పై దుండగుల దాడి
బీజేపీ కార్యకర్త పై దుండగుల దాడి
చురకలు విలేఖరి
జగిత్యాల, నవంబర్ 20
జగిత్యాల గ్రామీణ మండలం
తిమ్మాపూర్ గ్రామానికి చెందిన బీజేపీ కార్యకర్త దుబ్బాక
రమేష్ పై గుర్తు తెలియని దుండగులు దాడికి పాల్పడ్డారు. బుధవారం మార్నింగ్ వాకింగ్ చేసేందుకు వచ్చిన
రమేష్ పై మోతె బైపాస్ వద్ద ఈ దాడి జరిగింది. కారులో వచ్చిన నలుగురు గుర్తు తెలియని
వ్యక్తులు మాస్క్ వేసుకొని కత్తులతో
గాయపరిచినట్లు తెలిసింది. తాను స్పృహ కోల్పోయిన వెంటనే అక్కడి
నుంచి పరారైనట్లు దుండగులు పారిపోయారు. స్థానికుల
సహాయంతో జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన
రమేష్ కు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఇదిలా
ఉండగా ఓ ముగ్గురు వ్యక్తులు కావాలనే
ఉద్దేశపూర్వకంగా తనపై దాడికి పాల్పడినట్లు బాధితుడు
రమేష్ చెబుతున్నప్పటికీ ఇందుకు సంబంధించిన పూర్తి
వివరాలు తెలియాల్సి ఉంది. జగిత్యాల రూరల్ సీఐ కృష్ణ రెడ్డి వివరాలు సేకరిస్తున్నారు...