పెద్దపల్లి జిల్లాకు నాల్గు పోలిస్ స్టేషన్లు మంజూరు
జిల్లాలో నాలుగు పోలీస్ స్టేషన్లు మంజూరు*
*జీవో జారీచేసిన స్పెషల్ చీఫ్ సెక్రటరీ రవి గుప్తా*
చురకలు ప్రతినిధి
కమాన్ పూర్ డిసెంబర్ 2.
పెద్దపల్లి జిల్లాలో నాలుగు పోలీస్ స్టేషన్ లు మంజూరు చేస్తూ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రవి గుప్తా ఉత్తర్వులను జారీ చేశారు. పెద్దపల్లి పట్టణం కేంద్రంలో మహిళా పోలీస్ స్టేషన్ ను, పెద్దపల్లి రూరల్ పోలీస్ స్టేషన్ ను, పెద్దపల్లి టౌన్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ను మరియు ఎలిగేడు పోలీస్ స్టేషన్ ను మంజూరు చేస్తూ జీవో నెంబర్ 87 ద్వారా పెద్దపల్లి మహిళా పోలీస్ స్టేషన్, జీవో నెంబర్ 85 ద్వారా పెద్దపల్లి రూరల్ పోలీస్ స్టేషన్, జీవో నెంబర్ 86 ద్వారా పెద్దపల్లి టౌన్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్, జీవో నెంబర్ 88 ద్వారా ఎలిగేడు పోలీస్ స్టేషన్ మంజూరు చేస్తూ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రవి గుప్తా ఉత్తర్వులు జారీ చేశారు. కాగా ఎలిగేడు మండలం అయినా నాటినుండి ఇప్పటివరకు ఎలిగేడులో పోలీస్ స్టేషన్ లేక జూలపల్లి మండల పోలీస్ స్టేషన్ కు వెళ్లేవారు. ప్రస్తుతం ఎలిగేడు మండలానికి పోలీస్ స్టేషన్ మంజు రావడంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.