ముస్లిం శాదిఖాన, కబ్రస్తాన్, మసీదుల కోసం నిధులు మంజూరు చేయండి
ముస్లిం షాది ఖానా కబ్రస్తాన్ మసీదుల ప్రహరీ గోడల నిర్మాణం కొరకు వెంటనే నిధులు మంజూరు చేయండి
హుజురాబాద్ డివిజన్ మస్జిద్ ఈద్గా కబ్రిస్తాన్ మేనేజ్మెంట్ కమిటీ అధ్యక్షుల అసోసియేషన్ అధ్యక్షులు మొహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు ఉత్తంకుమార్ రెడ్డి పొన్నం ప్రభాకర్ డి శ్రీధర్ బాబులకు విజ్ఞప్తి
చురకలు విలేఖరి
హుజూరాబాద్, డిసెంబర్,15
హుజురాబాద్ నియోజకవర్గం లోని ముస్లింలకు సంబంధించిన సమస్యల పరిష్కారం కొరకు వెంటనే కృషి చేయాలి కరీంనగర్ ఇన్చార్జి మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి మంత్రులు పున్నం ప్రభాకర్ డి శ్రీధర్ బాబు హుజురాబాద్ శాసనసభ్యులు పాడి కౌశిక్ రెడ్డి హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ప్రణవ్ బాబు చొరవ తీసుకొని హుజురాబాద్ ముస్లిం షాది ఖానా కొరకు 50 లక్షలు నిధులను వెంటనే మంజూరు చేయాలి అలాగే జమ్మికుంట మండలం విలాసాగర్ పట్టణములో ఉన్న ముస్లింల కబ్రుస్తాన్ స్థలము 2 ఎకరాల స్థలం సర్వే నెంబర్ 349 లో దర్గా తోపాటు ముస్లిం కభ్రస్థాన్ అని 1996 సంవత్సరం పహాని లో ఉంది కానీ ఇప్పుడు భరణిలో ప్రభుత్వ భూమి అని నమోద చేశారు వెంటనే ప్రభుత్వ భూమి అని నమోదు చేసిన దానిని వెంటనే మార్పిడి చేసి ముస్లిం కబ్రిస్తాన్ అని ధరణిలో మార్పిడి చేయాలని హుజురాబాద్ డివిజన్ మస్జిద్ ఈద్గా ఖబరస్థాన్ మేనేజ్మెంట్ కమిటీ అధ్యక్షుల అసోసియేషన్ అధ్యక్షులు మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ ఉపాధ్యక్షులు మొహమ్మద్ జాకీర్ మహమ్మద్ అక్బర్ తో పాటు వివిధ కమిటీ అధ్యక్షులు ఈ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ మాట్లాడుతూ ధర్మారం పట్టణంలోని ఉన్న మస్జిద్ ప్రహరీ గోడ నిర్మాణం కొరకు రెండు లక్షల రూపాయలు ఇల్లంతకుంట మండలంలోని సీతంపేట గ్రామంలో ఉన్న మసీదు ప్రహరీ గోడ తోపాటు గేటు కొరకు రెండు లక్షల 50 వేల రూపాయలు నిధులను వెంటనే మంజూరు చేయాలని హుజురాబాద్ నియోజకవర్గం లోని ఉన్న ముస్లింల ఖబరస్థాన్లో ల చుట్టూ ప్రహరీ గోడ నిర్మాణం కొరకు కూడా నిధులు వెంటనే మంజూరు చేయాలని మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు హుజురాబాద్ పట్టణంలో ఉన్న ముస్లిం షాదీ ఖానా భవన నిర్మాణం తో పాటు చుట్టూ ప్రహరీ గోడ మూత్రశాలలు మరుగుదొడ్లు ముస్లిం షాది ఖానా భూమి సమానంగా లేనందున అందులో మట్టిని వేయించి జెసిబి తో సమానంగా సైదాపూర్ రోడ్డు ఎత్తు సమానంగా చేయవలసిన అవసరం ఉంది కనుక దానికి వెంటనే ప్రభుత్వం 50 లక్షల రూపాయల నిధులను మంజూరు చేయాలి దేనితో పాటు ముస్లిం షాది ఖానాలో విద్యుత్తు లైట్లు ఫ్యాన్లు కరెంట్ వైరింగ్ సెంట్రల్ లైటింగ్ ఇలాంటి మర్మతుల కొరకు కూడా 25 లక్షలు వెంటనే మంజూరు చేయించడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో పాటు మంత్రులు ఇంచార్జ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి పున్నం ప్రభాకర్ డి శ్రీధర్ బాబు శాసనసభ్యులు పాడి కౌశిక్ రెడ్డి హుజురాబాద్ నియోజవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ వి ప్రణవ్ బాబు చొరవ తీసుకోవాలని హుజురాబాద్ డివిజన్ మస్జిద్ ఈద్గా కబ్రిస్తాన్ మేనేజ్మెంట్ కమిటీ అధ్యక్షుల అసోసియేషన్ అధ్యక్షులు మొహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ ఆదివారం రోజు సాయంత్రం పత్రిక విలేకరుల సమావేశంలో మాట్లాడినారు