జగిత్యాలలో కాంగ్రెస్ సంబరాలు..
జగిత్యాలలో కాంగ్రెస్ సంబరాలు..
వయానాడ్ ఎంపీగా ప్రియాంక గాంధీ విజయం, జార్ఖండ్ లో కాంగ్రెస్ కూటమి విజయం పట్ల హర్షం..
చురకలు విలేకరి, జగిత్యాల, నవంబర్ 24 : వయానాడ్ ఎంపీగా ప్రియాంక గాంధీ ఘన విజయం సాధించడం, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమి ఘన విజయం సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ఆదివారం జగిత్యాల జిల్లా కేంద్రంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ టి. జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో విజయోత్సవ సంబరాలు నిర్వహించారు. ఈ సందర్బంగా తహసీల్ చౌరస్తా వద్ద టపాసులు పేల్చి మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు టి. విజయలక్ష్మి దేవేందర్ రెడ్డి, నాయకులు గాజెంగి నందయ్య, కొత్త మోహన్, కల్లెపెల్లి దుర్గయ్య, గాజుల రాజేందర్, కామటాల శ్రీనివాస్, రమేష్, మునిరోద్దీన్ మున్నా, ముకస్సర్ అలీ నేహాల్, నక్క జీవన్, గుండా మధు, భీరం రాజేష్, అతాఉల్లా, రూహిద్, నాజీమ్, షహేబాజ్, అద్నన్, రియాజ్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.