ద్రోహి ఇచ్చిన సమాచారంతోనే చాల్పాక ఎన్కొంటర్ మావోయిస్ట్ రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్

ద్రోహి ఇచ్చిన సమాచారంతోనే  చాల్పాక ఎన్కొంటర్ మావోయిస్ట్ రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్

ద్రోహి ఇచ్చిన సమాచారంతోనే చల్పాక ఎన్కౌంటర్ 
మావోయిస్ట్ రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్ 

చురకలు ప్రతి నిధి 


డిసెంబర్ 1వ తేదీన ములుగు జిల్లా, ఏటూర్ నాగారం మండలం, చల్పాక
 గ్రామ పంచాయితీ అడవుల్లో పోల్ కమ్మ వాగు వద్ద తెలంగాణ గ్రేహౌండ్స్ పోలీసులు ఏడుగురి విప్లవకారులకు విషమిచ్చి అతి కిరాతంగా చంపారనీ సిపిఐ మావోయిస్ట్ పార్టీ తెలంగాణా రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధిజగన్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నవంబర్ 30వ తేదీ సాయంత్రం ఏడుగురితో వున్న  దళం చల్పాక పంచాయితీలో వున్న వలస ఆదివాసీ గ్రామాన్ని కలిసి నమ్మిన వ్యక్తికి తినడానికి భోజనాలు ఏర్పాటు చేయమని చెప్పారనీ, ముందుగానే పోలీసులకు అప్రోవర్ గా మారిన ఇన్ఫార్మర్ ద్వారా భోజనంలో విషం ఇచ్చి స్పృహ కోల్పోయే లాగా చేశారనీ ,స్పృహా కోల్పోయిన కామ్రేడ్స్ ను పట్టుకుని చిత్రహింసలు పెట్టి తెల్లవారుఝామున 4 గంటలకు అతి సమీపం నుండి కాల్చి చంపారని జగన్ ఆరోపించారు.శతృవు మోస పూరిత పథకంలో చిక్కి అమూల్యమైన కామ్రేడ్స్ కురుసం మంగు @ పాపన్న, ఐద్రు (తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు), ఏగోలపు మల్లయ్య @(మధు, కోటి జెఎండబ్ల్యూపీ డివిజన్ కమిటీ సభ్బుడు), ముచాకీ అందాల్ @ కరుణాకర్ (ఇల్లెందు నర్సంపేట్ ఏరియా కమిటి సభ్యుడు). ముచాకీ బూమే@ జమున (ఏరియా కమిటీ సభ్యురాలు). పూనెం చోటు @కిశోర్( రీజినల్ కంపెనీ-2 మొదటి ప్లటూన్ పార్టీ కమిటి సభ్యుడు), కర్టం కామాల్ (రీజినల్ కంపెనీ-2లోని రెండవ ప్లటూన్ సభ్యుడు), కా, జైసింగ్ (ఏటూర్ నాగారం- మహదేవ్ పూర్ ఏరియా దళం సభ్యుడు) లు ప్రాణాలర్పించారనీ పేర్కొన్నారు. ప్రజల కోసం ప్రాణాలర్పించిన అమరకులకు  తెలంగాణ రాష్ట్ర కమిటీ విప్లవ జోహార్లు అర్పిస్తున్నదట్లు జగన్ పేర్కొన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం జరిపిన పాశవిక హత్యకాండను తీవ్రంగా ఖండిస్తూ డిసెంబర్ 9న తెలంగాణ రాష్ట్ర కమిటీ రాష్ట్ర వ్యాప్త బంద్ కు పిలుపునిస్తున్నట్లు,  పీడత ప్రజలు, ప్రజాస్వామిక వాదులు, విద్యాలయాలు, తదితర వ్యాపార సంస్థలు బందును పాటించి జయప్రదం చేయాలని జగన్ కోరారు. ఈ ఘటనకు కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ నాయకులు పూర్తి బాధ్యత వహించాలనీ,ఘటనపై న్యాయ విచారణ జరిపి బాధ్యులైన పోలీసులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలనీ ,రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కార్పోరేట్లకు అత్యంత విశ్వాసంగా కొమ్ముకాస్తుందనీ ,వారి లాభాల కోసమే దోపిడి విధానాలను అమలు చేస్తున్నదని, అందులో భాగంగానే ప్రజా వ్యతిరేక విధానాలకు అడ్డంకిగా మారిన ప్రజా ఉద్యమాలను అణిచివేయడానికి ప్రజా పోరాటాలకు నాయకత్వం వహిస్తున్న మావోయిస్టు పార్టీని, పార్టీ నాయకత్వాన్ని లక్ష్యంగా చేసుకుని ఆపరేషన్ కగార్ ను కొనసాగిస్తున్నారని జగన్ పేర్కొన్నారు.దామెరతోగు, రఘునాథపాలెం, పోల్ కమ్మ వాగు వంటి వరుస ఎన్ కౌంటర్ల పేరుతో హత్యలకు పాల్పడుతున్నారని,కాంగ్రెస్ పార్టీ కొనసాగిస్తున్న ఈ పాశవిక దాడులను ప్రజలు, ప్రజాస్వామిక వాదులు, మేధావులు తీవ్రంగా ఖండించాలని జగన్ కోరారు.IMG-20241205-WA0002

Tags: