12 మంది అదనపు ఎస్పీలకు ఎస్పిలు గా పదోన్నతి
12 మంది అదనపు ఎస్పీలకు ఎస్పీలుగా పదోన్నతి
చురకలు ప్రతినిధి
హైద్రాబాద్, డిసెంబర్,16
రాష్ట్రంలో పనిచేస్తున్న 12 మంది అదనపు ఎస్పీలకు నాన్ క్యాడర్ ఎస్పీలుగా పదోన్నతి కల్పించడంతోపాటు పోస్టింగ్లు ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి రవిగుప్త సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. కె. గుణశేఖర్ కు ట్రాఫిక్ డిసిపి మేడ్చల్, నరసింహారెడ్డికి రాచకొండ ఎస్బిఐ, మల్లారెడ్డికి రాచకొండ ట్రాఫిక్ డిసిపి గా, శ్రీనివాసరావుకు సిఐడి ఎస్పీగా, శోభన్ కుమార్ కు డిసిపి
ఎస్ఓటీ మాదాపూర్, సాయి మనోహర్ కు డిసిపి ట్రాఫిక్ మాదాపూర్ గా, రమేష్ కు ఇంటలిజెన్స్ ఎస్పీగా, చెన్నైకు ఎస్పీ టీజీ ఐసీసీసీ హైదరాబాద్ కు, విజయ్ కుమార్ కు సిఐడి ఎస్పీగా, కరుణాకర్ డిజిపి కార్యాలయానికి, మనోహర్ ను రోడ్ సేఫ్టీ డిసిపి హైదరాబాద్ గా, శ్రీనివాసు ను డీసీపీ ఎస్ ఓ టీ మేడ్చల్ కు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.