మెగా జాబ్ మేళా గ్రాండ్ సక్సెస్ 3200 మంది నిరుద్యోగులు హాజరు 1107 మందికి నియామక పత్రాలు ఎస్పి అశోక్ కుమార్
పోలీసుల శాఖ ఆద్వర్యంలో నిర్వహించిన మెగా జాబ్ మేళా గ్రాండ్ సక్సెస్....*
*- - - యువత ఉపాధి అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలి.*
*- - - 3200 మంది పైగా నిరుద్యోగ యువతి యువకులు హాజరు*
*- - - ఉద్యోగాలకు ఎంపిక అయన 1107 యువతకు నియామక పత్రాలు అందజేత*
జిల్లా ఎస్పి శ్రీ అశోక్ కుమార్
చురకలు విలేఖరి
జగిత్యాల, డిసెంబర్,11
వృత్తి నైపుణ్యం (స్కిల్ డెవలప్‌మెంట్) పెంచుకుని స్వయం ఉపాధివైపు యువతను తీసుకువెళ్లాలన్న లక్ష్యంతోనే జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహిచమని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ అన్నారు. జగిత్యాల జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో త్రెడ్స్ ఐటి
గ్రూమింగ్ ఎక్సలెన్స్ వారి సహకారం తో జిల్లా కేంద్రం లోని ఏ ఆర్ ఫంక్షన్ హాల్ నందు నిరుద్యోగ యువతకై నిర్వహించిన మెగా జాబ్‌మేళాను జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ జ్యోతి ప్రజ్వల చేసి ప్రారంభించారు. ఉదయం 11 గంటల నుండి ప్రారంభమైన ఈ మెగా జాబ్‌మేళాకు ముందుగా ఆన్‌లైన్‌లో పేర్లు నమోదు చేసుకున్న 3200 మ౦ది యువత పెద్ద సంఖ్యలో ఈ మేళాకు తరలిరాగా 58 వివిధ కంపెనీలకు చెందిన హెచ్.ఆర్‌లు వచ్చిన యువతకు సంబంధించి విద్యార్హతలను బట్టి ఇంటర్యూలు నిర్వహించిన అనంతరం తమ సంస్థల్లో పనిచేసేందుకు ఎంపిక చేసిన 1107 మందికి నియామక పత్రాలను అందించారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ.... యువత తలుచుకుంటే సాధించాలేనిదంటూ ఇది లేదు అన్నారు.. యువతీ యువకులు తల్లిదండ్రులపై ఆధారపడకుండా ఉద్యోగాలు చేసుకొని కుటుంబానికి అండగా నిలబడాలని సూచించారు. చదువు అనేది ఉద్యోగానికి, పేదరికం అడ్డురాదని పేర్కొన్నారు. అత్యున్నత స్థాయిలో ఉన్న ఎంతో మంది వ్యక్తులు పేదరికాన్ని జయించిన వారే అన్నారు. మనకు నచ్చిన వృత్తి నైపుణ్యం ఉన్నా రంగాల్లో ఉద్యోగాలు చేయడం చాలా ఉత్తమమని అన్నారు. జీతం ఎంత వస్తుంది అనే అంశం పైన డిసిషన్ ఉండకూడదని మనకు నచ్చినా,వృత్తి నైపుణ్యం ఉన్నా రంగాల్లో మాత్రమే ఎంపిక చేసుకోవాలని అన్నారు. జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకున్న తర్వాత మిగతావన్నీ వాటంతట అవే మన దగ్గరకు వస్తాయని అభిప్రాయపడ్డారు.
ప్రతి ఒక్కరికీ ఉద్యోగం చేయాలనే తాపత్రయం ఉంటుంది కానీ ఏ ఉద్యోగం చేయాలని ఎవరు నమ్మాలో తెలియక చాలామంది మోసపోతుంటారు అని ఎవరైనా డబ్బులకు గవర్నమెంట్ ఉద్యోగాలు ఇస్తామని చెప్పితే నమ్మవద్దని తెలిపారు. నిరుద్యోగ యువత గల్ఫ్ దేశాలకు వెళ్లాలి అనుకున్నప్పుడు సంబంధిత ఏజెంట్ ద్వారా ఆ యొక్క ఉద్యోగం గురించి చి పూర్తి సమాచారం తెలుసుకున్న తరువాతనే ఆ యొక్క ఏజెంటుకు డబ్బులు ఇవ్వాలని మరియు ఆ యొక్క ఏజెంటు ప్రభుత్వం నుండి ఆమోదం పొందిన వ్యక్తి అవునా కాదా అని తెలుసు కోవాలని అన్నారు.
ఈ యొక్క జాబ్ మేళాను విజయవంతం చేయడంలో కృషి చేసిన డిఎస్పీలు ఆయా సర్కిల్ ఇన్స్పెక్టర్లు ఎస్సైను ఎస్పీ అభినందనలు తెలియజేశారు
ఈ యొక్క కార్యక్రమంలో అదనపు ఎస్పీ భీమ్ రావు, డిఎస్పీ లు రఘుచందర్, సి.ఐ లు రాంనరసింహారెడ్డి, వేణుగోపాల్,రవి,కృష్ణారెడ్డి, రిజర్వ్ ఇన్స్పెక్టర్ లు కిరణ్ కుమార్,రామకృష్ణ, వేణు మరియు ఎస్. ఐలు, వివిధ కంపెనీలకు చెందిన ప్రతినిధులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.