షాషాద్ నగర్ ఎమ్మెల్యే పై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు

షాషాద్ నగర్ ఎమ్మెల్యే పై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు

షాద్ నగర్ ఎమ్మెల్యే పై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు

వెలమ సామాజిక వర్గాన్ని అసభ్య పదజాలంతో దూషించిన షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ పై చర్యలు తీసుకోవాలని జగిత్యాల వెలమ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పట్టణ పోలీస్ స్టేషన్లో  సిఐ వేణుగోపాల్ కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా జగిత్యాల పద్మనాయక కళ్యాణం మండపం నుండి నిరసన వ్యక్తం చేస్తూ సంఘ సభ్యులు ర్యాలీగా జగిత్యాల పట్టణ పోలీస్ స్టేషన్ కు చేరుకొని ఎమ్మెల్యే పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం మాట్లాడుతూ అహంకార ధోరణితో ఎమ్మెల్యే శంకర్ వెలమ సామాజిక వర్గాన్ని దూషించడం సమంజసం కాదని బాధ్యతతో కూడిన పదవిలో ఉన్న ఎమ్మెల్యే ఇలా మాట్లాడడం పట్ల రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకొని అతనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో జగిత్యాల వెలమ సంక్షేమ సంఘం అధ్యక్షుడు సాగర్ రావు, సెక్రెటరీ దన్నపనేని వేణుగోపాలరావు, మాజీ అధ్యక్షులు పురుషోత్తం రావు తో పాటు కార్యవర్గ సభ్యులు సంఘ సభ్యులు పాల్గొన్నారు.IMG-20241206-WA0003

Tags: