కుళ్లిన ఆలు సమోసా...

కుళ్లిన ఆలు సమోసా...

కుళ్ళిన ఆలు సమోసా...

వినియోగదారుడిని దుర్భాషాలాడిన హోటల్ యజమాని...


హోటల్లో సమోసా తీసుకున్న వ్యక్తికి కుళ్ళిపోయిన ఆలు సమోసా ఇవ్వడంతో ఆ హోటల్ యజమానితో సమోసా కుళ్ళిపోయిందని అడుగగా ఇష్టముంటే తిను లేకుంటే వెళ్ళిపో అంటూ దుర్భాషలాడిన ఘటన జగిత్యాల జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. గురువారం సాయంత్రం కృష్ణ అనే వ్యక్తి జగిత్యాల కొత్త బస్టాండ్ ఇన్ గేట్ పక్కనే ఉన్న ఓ హోటల్ కు వెళ్లి సమోసా తీసుకోగా ఆ సమోసా కుళ్ళిపోయి ఉండటంతో సదరు వ్యక్తి సమోసాలో ఆలు కుళ్ళిపోయి ఉందని హోటల్ యజమానిని అడిగాడు. దీంతో హోటల్ యజమాని ఏం చేసుకుంటావో చేసుకోమని దుర్భాషలాడాడు.  కృష్ణ విలేకరులతో మాట్లాడుతూ సమోసా కూల్లిన దానిని ప్రజలకు అమ్ముతున్నాడని, యజమాని నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాడని,  ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్నారని హోటల్ యజమానిపై ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు చర్యలు తీసుకోవాలని కోరాడు. హోటలలో తిను పదార్థాలను విధిగా ఆహార భద్రత అధికారులు తనిఖీలు చేయాలని కోరుతూ సమోసా తీసుకున్న వ్యక్తి ఆవేదన వ్యక్తం చేశారు.IMG-20241205-WA0000

Tags: