పి ఎల్ జి ఏ 24 వ వార్షికోత్సవాలను జరుపుకొందాం కగార్ యుద్ధాన్ని తిప్పికోడదాం

పి ఎల్ జి ఏ 24 వ వార్షికోత్సవాలను   జరుపుకొందాం   కగార్ యుద్ధాన్ని తిప్పికోడదాం

పి ఎల్ జి ఏ 24 వ వార్షికోత్సవాలను   జరుపుకొందాం
 
కగార్ యుద్ధాన్ని తిప్పికోడదాం

జె యం డబ్యూ పీ డివిజన్ కార్యదర్శి వెంకటేష్ 

చురకలు ప్రతినిధి 
జగిత్యాల,నవంబర్,25IMG-20241125-WA0000

విప్లవోద్యమ నిర్మూలనకై కేంద్ర, రాష్ట్ర, ప్రభుత్వాలు కొనసాగిస్తున్న   కగార్ విప్లవ  ప్రతిఘాతుక యుద్దాన్ని  తిప్పికొట్టాలని, డిసెంబరు 2నుండీ 8 వరకు నిర్వహించే పీఎల్జి ఏ,24 వార్షికోత్సవలను విజయవంతం చేయాలని జయశంకర్ భూపాలపల్లి,జిల్లా, ములుగు, వరంగల్, పెద్దపల్లి జిల్లాల మావోయిస్ట్ పార్టి డివిజన్ కమిటి కార్యదర్శి వెంకటేష్ సోమవారం విడుదల చేసిన పత్రిక ప్రకటన లో పేర్కొన్నారు.
దేశంలో నూతన ప్రజాస్వామిక  విప్లవ విజయసాధనకోసం  ప్రజా యుద్దాన్ని  కొనసాగిస్తున్న ప్రజా విముక్తి గెరిల్లా సైన్యానికి (పి  ఎల్ జి ఏ) డిసెంబర్ నాటికి 24 ఏళ్ళు నిండుతాయనీ,ఈ సందర్భంగా డిసెంబర్ 2నుండి 8 వరకు  పి ఎల్ జి ఏ వార్షికోత్సవాలను,  డివిజన్ వ్యాప్తంగా అటవీ,మైదాన,పట్టణ ప్రాంతాల్లో విప్లవోత్సాంతో  జరుపాల్సిoదిగా యావత్తు పార్టీ కమిటీలకు, పార్టీ శ్రేణులకు,ప్రజా సంఘాలకు, విప్లవ ప్రజానీకానికి
ఆయన పిలుునిచ్చారు .తన ప్రజాస్వామిక విప్లవాన్ని విజయ వంతం చేసే లక్ష్యంతో   ప్రజా యుద్ధం కొనసాగిస్తున్న పార్టీ, పి ఎల్ జి ఏ డివిజన్ లో శత్రువు కల్పించిన ఆటంకాలను అధిగమించి ప్రజా యుద్దాన్ని  బలోపేతం చేయడానికి సంవత్సర కాలంలో రాజకీయ, నిర్మాణ  క్రృషిలో భాగమైన పార్టీ కమిటీలకు, శ్రేణులకు విప్లవ ప్రజలకు, సంఘాలకు   అరెస్టులయి తీవ్రంగా  చిత్రహింసలను , మానసిక వేధింపులను ధిక్కరించి  జైలు  జీవితాన్ని అనుభవిస్తున్న విప్లవకారులకు, డివిజన్ కమిటీ  విప్లవాభివందనాలు తెలిపారు.
  బ్రాహ్మణీయ హిందుత్వ ఫాసిస్టులు విప్లవ  ప్రతిఘాతుక  సూరజ్ కుండ్ వ్యూహాత్మక పథకంలో భాగంగా కగార్  ఆపరేషన్ పేరుతో  కొనసాగిస్తున్న శత్రువు  దుష్ట పథకానికి తలవంచక త్యాగనీరతితో ,అసమాన  ధైర్యసాహసాలతో  ప్రతిఘటిస్తూ  పి ఎల్ జి ఏ వార్షిక సంవత్సరంలో  254 మంది  వీర గెరిల్లాలు  తమ ప్రాణాలను త్రృణపాయంగా అర్పించారనీ డివిజన్ కార్యదర్శి వెంటేశ్ తెలిపారు.తాత్కాలిక వెనుకంజలో ఉన్న తెలంగాణ విప్లవోద్యమాన్ని ముందుకు తీసుకుపోతున్న క్రమంలో  కమిటీ కార్యదర్శి  ,కమాండర్ సాగర్ , పిపిసిఎమ్ కామ్రేడ్ మణిరాం , సీనియర్ పార్టీ సభ్యుడు కామ్రేడ్ విజెందర్, తెలంగాణ లో  విప్లవోద్యమం లో పనిచేసి దండ కారణ్య
విప్లవోద్యమంలోకి వెళ్లిన కామ్రేడ్  జోగన్న , కామ్రేడ్ శంకర్ లు అమరులయినారనీ, దళిత , ఆదివాసీ,మత మైనారిటీల పీడిత ప్రజల  ప్రజాస్వామిక హక్కుల కోసం తమ అమూల్యమైన ప్రాణాలను త్రృణపాయంగా అర్పించిన వీరయోదులకు   జె ఎం డబ్ల్యూ పి  డివిజన్ కమిటీ తలవంచి జోహార్లు అర్పిస్తున్నట్లు వెంకటేష్ తెలిపారు.
బ్రాహ్మణీయ హిందుత్వ బి జె పి,ప్రభుత్వం 2047 నాటికి వికసిత్ భారత్ అంటే కార్పొరేట్ హిందూ రాష్ట్ర (కార్పొరేటీకరించబడ్డ  హిందూ దేశం) ఏర్పాటు చేసే దృష్ట పథకం లో భాగంగా ఈ దాడులు జర్పుతున్నట్లు తెలిపారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు 6 గ్యారెంటీలతో పాటు 7 వ గ్యారంటీ ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరిస్తామని చెప్పి వాటిని తుంగలో తొక్కి అధికారంలోకి వచ్చిన వెంటనే  ఆర్ ఎస్ ఎస్, బిజెపి లక్ష్యాన్ని పరపూర్తి చేయడానికి సామ్రాజ్యవాదులతో,దళారీ నిరంకుశ పెట్టుబడిదారులైన ఆదానీతో పాటు అనేక మంది పెట్టుబడిదారులతో  ఒప్పందాలు  చేసుకుని వాటిని అమలు చేయడానికి వికారాబాద్ జిల్లా దామగుండంలో వందలాది ఎకరాల భూమిని,మూసి నది  ప్రక్షాళన పేరుతో పేద ప్రజల ఇండ్లను కూలగొడుతూ వారిని బజారున పడేస్తున్నారనీ వెంకటేష్ తెలిపారు. కొడంగల్ నియోజకవర్గం పరిధిలోని లగచర్లలో ఫార్మా కంపెనీకి భూములను అప్పజెప్పాలని ఒప్పందాలు చేసుకున్నారనీ,ఇంకా అనేక కంపెనీలతో చేసుకున్న ఒప్పందం లో భాగంగా ప్రజల భూములను లాక్కొని వారిని నిర్వాసితులను చేయాలనే  పథకంతో ఉన్నారనీ పేర్కోన్నారు.
 కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే నిరుద్యోగులకు ఉద్యోగాలు, రైతులకు రుణమాఫీ,రైతు బంధు పథకం అమలు చేయడం లేదునీ,ఆదివాసులకు 5వ,6,వ షెడ్యూల్ ను అమలు చేయకుండా వాటిని తుంగలో తొక్కి వారికి అడవిపై హక్కు లేకుండా చేస్తున్నారని,ప్రజలు వివిధ రకాల సమస్యలపై పోరాడుతున్న వారిని పోలీసులతో లాటీ చార్జీలు చేయించి అణిచివేస్తున్నారనీ,ప్రజల సమస్యలపై పోరాడుతున్న ప్రజా సంఘాలను  మావోయిస్టులనే పేరుతో ఊపా కేసులు పెట్టిన జైల్లో పెడుతున్నారనీ,
కేంద్ర ప్రభుత్వం తో కుమ్మక్కయి సూరజ్ కుండ్ వ్యూహాత్మక పథకపు లో భాగంగా కగార్ పేరుతో బార్డర్ లో చేస్తున్న ప్రతి దాడిలో  పాల్గొంటున్నారనీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క కేంద్ర హోంమంత్రి అమిత్ షా ను కలిసి తెలంగాణాలో విప్లవోద్యమం బలపడుతుందని కొన్ని జిల్లాలను నక్సల్స్ ప్రభావిత జిల్లాలుగా గుర్తించాలని  బార్డర్ లో  స్పెషల్ టాస్క్ ఫోర్స్ బలగాలతో  క్యాంపులు  వేయాలని వారితో ఒప్పందం చేసుకున్నారని ప్రకటనలో పేర్కొన్నారు.
ఈ దోపిడి పాలక వర్గాలకు  వ్యతిరేకంగా పోరాడుతున్న విప్లవ ప్రజలను,వారికి మద్దతుగా నిలుస్తు పోరాడుతున్న ప్రజా సంఘాలను, మావోయిస్టు పార్టీని అరెస్టులు చేసి కేసులు పెట్టి జైల్లో పెడుతున్నారని,బూటకపు ఎన్ కౌంటర్లకు పాల్పడుతున్నారని,అయినప్పటికీ మొక్కవోని ధైర్యంతో నూతన ప్రజాస్వామిక విప్లవం , సోషలిజం, అంతిమంగా కమ్యూనిజమే లక్ష్యంతో పోరాడుతూ ఎన్నో త్యాగాలు చేస్తూ అమరులయినారు వారందరికి తలవంచి జోహార్లు అర్పించాలని కొరారు.అమరులు అందించిన స్ఫూర్తి తో దోపిడి పాలక వర్గాలను కూల్చివేసి  నూతన ప్రజాస్వామిక విప్లవాన్ని విజయవంతం చేయడానికి యువతీ, యువకులంతా పి ఎల్ జి ఏ లో చేరాలని డివిజన్ కమిటి కార్యదర్శి వెంకటేష్ కొరారు.

Tags: