పోరాటాల గడ్డపై జన ప్రభంజనం

పోరాటాల గడ్డపై జన ప్రభంజనం

IMG-20241201-WA0009IMG-20241201-WA0009- *కరీంనగర్ నియోజకవర్గ స్థాయి పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనం*

 - *పోరాటాల గడ్డపై జన ప్రభంజనం*

-  *అడుగడుగునా ఆశీర్వాదం* 

- *వి ఎన్ ఆర్ కు వెల్లువెత్తిన ప్రజాభిమానం*

- *బైక్ ర్యాలీకి భారీ స్పందన - వీఎన్ఆర్ శిబిరంలో జోష్* 

 కరీంనగర్ జిల్లా కేంద్రంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ గా పోటీ చేస్తున్న ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి   ఆధ్వర్యంలో చేపట్టిన పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనం గ్రాండ్ సక్సెస్ అయ్యింది...  కరీంనగర్ జిల్లా కేంద్రంలోని జెనెక్స్ మైదానం నుండి 1500 మోటార్ బైక్ ర్యాలీ కరీంనగర్ పట్టణంలో భారీ ఎత్తున కొనసాగింది.. పట్టభద్రుల  ఆత్మీయ సమ్మేళనానికి వివిధ జిల్లాల నుండి   విద్యావంతులు పట్టభద్రులు మేధావులు డాక్టర్లు  న్యాయవాదులు ఉపాధ్యాయులు భారీ ఎత్తున పాల్గొన్నారు... ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా  ట్రస్మా  స్టేట్ ప్రెసిడెంట్ NS రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరైనారు ... ఈ సందర్భంగా పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి మాట్లాడుతూ.. ఎడ్యుకేషన్ హబ్ గా తీర్చిదిద్దుతానని వెల్లడించారు... ఉద్యోగ నిరుద్యోగపట్టభద్రులకు బాసటగా నిలిచేందుకే ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నానని వెల్లడించారు..
అల్ఫోర్స్ విద్యాసంస్థల యజమానిగా నేను ఎంతో మంది విద్యార్థులను విద్యావంతులుగా తయారు చేశాను. ఎంతో మంది పట్టభద్రులకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించాను. వారి బాధలు విన్నాను. వారి సమస్యలు అర్థం చేసుకునాన్నను. వారికి అండగా నిలిచాను. వారి సమస్యల పరిష్కారం కోసం ఒక విద్యా సంస్థల యజమానిగా కృషి చేశానని వెల్లడించారు.. తాను గత 3 నెలల నుండి MLC సెగ్మెంట్ పరిధిలో ఉన్నా 42 అసెంబ్లీ నియోజక వర్గాలు పర్యటించడం జరిగిందని . ఈ క్రమంలో వేలాదిమంది విద్యావంతులను, నిరుద్యోగ యువతను, వివిధ రంగాలలో పనిచేస్తున్నా ప్రైవెట్ మరియు ప్రభుత్వ ఉద్యోగులను కలవడం జరిగిందని అన్నారు...ఈ సందర్బంగా అనేక సమస్యలు తన దృష్టికి తీసుకురావడం జరిగిందని అన్నారు... విద్యావంతుడైన తనను ఆశీర్వదించాలని  MLC గా పోటీచేయడానికి మీ ముందుకు వస్తున్నానని ఎందుకంటే గత 34 సం||ల నుండి మీ అందరిలో ఒక్కడిగా ఉంటూ మీ అందరి ఆశీర్వాదంతో కరీంనగర్లోని ప్రతి కుటుంబ సభ్యుడిగా నన్ను ఆదరించాలని కోరుతున్నాను. వివిధ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న నిరుద్యోగ యువతీ యువకులకు స్టడీ మెటీరియల్ తో కూడిన పాఠ్యపుస్తకాలను  అందజేసినట్టుస్పష్టం చేశారు .. చదువుకున్న ప్రతి- ఒక్కరికి ఉద్యోగ భద్రత కల్పించాల్సిన  బాధ్యత తనపై  ఉందని, నిజామాబాద్ గ్రంథాలయంలో పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న యువతకు నెలరోజుల పాటు మధ్యాహ్నం భోజనం సదుపాయం కల్పిస్తానని వెల్లడించారు..  పోటీ  పరీక్షలకు హాజరయ్యేలా ఉచిత కోచింగ్ సెంటర్లను నెలకొల్పుతానని పేర్కొన్నారు..యువత ఉద్యోగ ఉపాధి కల్పన అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తానన్నారు...తన సొంత ఖర్చులతో ఎమ్మెల్సీ పరిధిలోని ప్రతి జిల్లా కేంద్రంలో కోచింగ్ సెంటర్లను నెలకొల్పుతానని అ అన్నారు...తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగుల కు బాసటగా నిలిచేందుకే రానున్న పట్టభద్రులు ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు పేర్కొన్నారు..గతంలో ఎమ్మెల్సీగా గెలిచిన నాయకులు పట్టభద్రుల సమస్యలను విస్మరించి పూర్తిగా రాజకీయాలకే సమయం కేటాయించారని అన్నారు... రానున్న పట్టభద్రుల ఎన్నికల్లో తనను గెలిపిస్తే ఉద్యోగ నిరుద్యోగ సమస్యలపై మండలిలో గలమెత్తుతానని అన్నారు... విద్యారంగ సమస్యలపై తనకు పూర్తిస్థాయిలో అవగాహన ఉందని వెల్లడించారు.. ప్రభుత్వం మేనిఫెస్టో లో పెట్టిన జాబ్ క్యాలెండర్ అమలుకు కృషి చేస్తానని అన్నారు.. రాష్ట్రవ్యాప్తంగా 317 జీవో తో ఉద్యోగులు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని.. వారి స్థానికతను ఆధారంగా తీసుకొని సొంత జిల్లాలకు బదిలీ అయ్యే విధంగా ప్రభుత్వంతో మాట్లాడి కృషి చేస్తానని అన్నారు,.ప్రభుత్వ రంగంలోని వివిధ శాఖలలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి కృషి చేస్తానని అన్నారు... ప్రైవేటు విద్యా సంస్థలలో పని చేస్తున్న ఉపాధ్యాయుల సంక్షేమానికి కృషి చేస్తానని..  ప్రతి ఒక్కరికి హెల్త్ కార్డులతో పాటు కనీసం ఇంటికొస్తే కనీసం పలకరించే మినిమం బేసిక్ సాలరీ అమలుకు కృషి చేస్తానని అన్నారు... ప్రైవేటు డిగ్రీ పీజీ కళాశాల యాజమాన్యాలు ఫీజు రియంబర్స్మెంట్ నిధులు విడుదల కాక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారికి ప్రభుత్వం నుండి రావలసిన నిధుల బకాయిలను విడుదల చేసేందుకు కృషి చేస్తానని అన్నారు.... ప్రభుత్వ ఉద్యోగుల యొక్క డిఏల మంజూరికి తన వంతుగా కృషి చేస్తానని అన్నారు.. ఐఎంఏ ప్రెసిడెంట్ డాక్టర్ ఏ నరేష్, కెప్టెన్ బుర్ర మధుసూదన్ రెడ్డి, సుక్మా స్టేట్ జనరల్ సెక్రెటరీ  రామకృష్ణ,  తానిపర్తి తిరుపతిరావు ,చిదుర సురేష్, టీఎన్జీవో ప్రెసిడెంట్ శ్రీనివాసరెడ్డి , సంగేం లక్ష్మణరావు, అపూర్వ వేణు, వి సతీష్ కుమార్,, కనకం వంశీ , కాశి పెద్ధి శ్రీధర్ రాజు, రాజిరెడ్డి, కిషన్ నాయక్ ,  పెండ్యాల కేశవరెడ్డి, ఎర్రం శెట్టి మునిందర్ ప్రభాకర్ గౌడ్, మహిపాల్  రెడ్డి Tpjma, ట్రస్మా జనరల్ సెక్రెటరీ మజీద్, ట్రస్మా స్టేట్ వైస్ ప్రెసిడెంట్  అజిజ్, సర్దార్ శార్దూల్ సింగ్  తదితరులు పాల్గొన్నారుIMG-20241201-WA0008

Tags: