గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు నిందితుల అరెస్టు

గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు నిందితుల అరెస్టు

గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు నిందితుల అరెస్టు

వివరాలు వెల్లడించిన జగిత్యాల డిఎస్పీ రఘుచందర్ 

ఇద్దరు నిందితుల వద్ద నుండి 2కిలోల
270 గ్రాముల గంజాయి స్వాధీనం

చురకలు ప్రతినిధి, జగిత్యాల, డిసెంబర్ 21:  జగిత్యాల జిల్లా కేంద్రంలో గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు నిందితులను పట్టుకొని వారిని రిమాండ్ కు తరలించినట్లు జగిత్యాల డిఎస్పీ రఘుచందర్ తెలిపారు. శనివారం పట్టణ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జగిత్యాల పట్టణానికి చెందిన కళ్యాణం ఉదయ్, ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం పిప్రి గ్రామానికి చెందిన మాడవి జనకరావ్ అనే ఇద్దరు నిందితులు శనివారం పట్టణంలోని రాజీవ్ బైపాస్ రోడ్డు, ఆర్డివో చౌరస్తా వద్ద
గంజాయి విక్రయించడానికి వచ్చారని పక్కా సమాచారంతో పోలీసులు అనుమానస్పదంగా తిరుగుతున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకొని తనిఖీలు నిర్వహించారని తెలిపారు. కళ్యాణం ఉదయ్ వద్ద నుండి 1కిలో 120 గ్రాముల మాడవి జనకరావ్ వద్ద నుండి 1కిలో 150 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకొని నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు. యువత పెడదారి పట్టి బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని, గంజాయి విక్రయించినా, సేవించినా, సరఫరా చేసినా చట్టప్రకారం కఠిన
చర్యలు తీసుకుంటామని, గంజాయి విక్రయించే, సేవించే, సరఫరా చేసే వారి వివరాలు తెలిస్తే స్థానిక పోలీసులకు, డయల్ 100కు సమాచారం అందించాలని, వివరాలు తెలిపిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు. ఈ సమావేశంలో టౌన్ ఇన్స్పెక్టర్ వేణుగోపాల్, ఎస్ఐ మన్మధరావు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.IMG-20241221-WA0005

Tags: