ఎసిబికీ పట్టుబడ్డ డిప్యూటీ ఫారెస్ట్ రేంజర్ విజిలెన్స్ అధికారులు, జిల్లా అధికారులు విఫలం
ఏసీబీకి పట్టుబడిన డిప్యూటీ ఫారెస్ట్ రేంజర్.
చురకలు ప్రతినిధి, జగిత్యాల, డిసెంబర్ 16 : జగిత్యాల జిల్లా మెట్ పల్లి పట్టణంలో సోమవారం ఏసీబి అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో మెట్ పల్లి డిప్యూటీ ఫారెస్ట్ రేంజ్ అధికారి హఫీజోద్దీన్ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. పల్లెపు నరేష్ అనే వ్యక్తి వద్ద నుండి రూ. 4500 లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండ్ గా పట్టుకున్నారు. పల్లెపు నరేష్ అనే వ్యక్తి వద్ద మెట్ పల్లి డిప్యూటీ ఫారెస్ట్ రేంజ్ అధికారి హఫీజోద్దీన్ లంచం డిమాండ్ చేయగా బాధితుడు ఏసీబిని ఆశ్రయించగా సోమవారం ఏసీబీ అధికారులు మెట్ పల్లి డిప్యూటీ ఫారెస్ట్ రేంజ్ అధికారి హఫీజోద్దీన్ లంచం తీసుకుంటున్న సమయంలో పట్టుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అయితే గతంలో పోడు పేరుతో 600 ఎకరాల అటవీ అన్యాక్రాంతం అయినట్లు ఆరోపణలు రాగా, ఈ విషయం పై జిల్లా అటవీశాఖ అధికారులు విజిలెన్స్ అధికారులు విచారణ చేయకుండా చేసినట్లు తెలిసింది.