మల్టీ జోన్ 1 లో 9 మంది ఇన్స్పెక్టర్ ల బదిలి
మల్టీ జోన్ 1 లో 9 మంది ఇన్స్పెక్టర్ల బదిలీలు
చురకలు విలేఖరి
జగిత్యాల, నవంబర్,23
మల్టీజోన్ 1 పరిధిలోని 9 మంది ఇన్స్పెక్టర్ లను బదిలిచేస్తు మల్టీ జోన్ 1 ఐజి, ఎస్, చంద్రశేఖర్ రెడ్డి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఐజి కార్యాలయంలో వెయిటింగ్ లో ఉన్న ఎస్, సతీష్ కుమార్ కు సీసీఆర్బి నిజామాబాద్ కు, డిసిఅర్బి, ఆదిలాబాద్ లో ఉన్న పబ్బ ప్రసాద్ కు ఎస్ హెచ్ ఓ నిజామాబాద్ ట్రాఫిక్ పోలిస్ స్టేషన్ కు, అక్కడ పనీ చేస్తున్న ఎస్ వీరయ్యకు పీసీఆర్ నిజామాబాద్ కు బదిలి చేశారు. జగిత్యాల సి సి ఎస్ జగిత్యాల , మానకోండూర్, పీ ఎస్ అటాచ్ లో ఉన్న కె, లక్మి నారాయణ కు ఎస్ హెచ్ ఓ మానకొండూర్ కు బదిలీ చేస్తూ, అక్కడా ఎస్ హెచ్ ఓ గా ఉన్నా జీ సదన్ కూమార్కు సి సి ఎస్ రాజాన్నా సిరిసిల్ల కు బదిలి చేశారు. ఐజిపి కార్యాలయంలో వెయిటింగ్ లో ఉన్నా ముస్కం శ్రీనివాస్ కు సిసీఎస్ జగిత్యాల కు బదిలీ చేశారు. ఐజీపీ కార్యాలయంలో వెయిటింగ్ లో ఉన్న అల్లం రాంబాబు కు డీ ఎస్బీ నిర్మల్ కు, అదేవిదంగా ఐజీపి కార్యాలయంలో వెయిటింగ్ లో ఉన్న మున్నూరు కృష్ణకు సిసిఎస్ నిర్మల్ కు, అదేవిదంగా ఐజిపీ కార్యాలయంలో వెయిటింగ్ లో ఉన్నా బీ. నరహరికు డిసిఆర్ బీ నిర్మల్ కు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.