యువతకు ఉపాధి రూపకల్పనకు కృషి అల్పోర్స్ నరేందర్ రెడ్డి
- *యువతకు ఉపాధి రూప కల్పనకు కృషి*
- *మార్పు కోసమే రాజకీయాల్లోకి*
- *మానకొండూర్ ఆత్మీయ సమ్మేళనం లో అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి*
తెలంగాణ నిరుద్యోగ యువత కు ఉద్యోగ రూపాకల్పనతో పాటు ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ముందుంటానని,కరీంనగర్ అదిలాబాద్ నిజామాబాద్ మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి స్పష్టం చేశారు.. ఆదివారం మానకొండూరు మండల కేంద్రంలో పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళన సమావేశం నిర్వహించారు. అంతకుముందు మానకొండూర్ మినీ ట్యాంక్ బండ్ నుండి భారీ బైక్ ర్యాలీని నిర్వహించారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువతకు వెల్లడించారు.. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న నిరుద్యోగ యువతకు మూడు సంవత్సరాల పాటు ప్రభుత్వము నిరుద్యోగ భృతి అందజేయాలని పేర్కొన్నారు... కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో పొట్టి నా జాబ్ క్యాలెండర్ అమలుకు కృషి చేస్తానని వెల్లడించారు.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే 50వేల ఉద్యోగాలను నియమించిందని గుర్తు చేశారు.. ఉద్యోగ నిరుద్యోగుల పట్టభద్రుల సమస్యలు తెలిసిన విద్యావంతులు రాజకీయాల్లోకి వస్తే వారి సమస్యలు పరిష్కారం అవుతాయని అన్నారు.. చదువుకున్న ప్రతి ఒక్కరికి ఉద్యోగం రాదని.. ప్రభుత్వం నిరుద్యోగ యువత కోసం పరిశ్రమలు నెలకొల్పిఉపాధి అవకాశాలు కల్పించాలని కోరారు.. రానున్న పట్టభద్రులు ఎన్నికల్లో తనని గెలిపిస్తే నిరుద్యోగ యువత గొంతుకగా మండలిలో వారి సమస్యలు పరిష్కరిస్తానని వెల్లడించారు.. ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని మెదక్ జిల్లాలోని చాలా ప్రభుత్వ కళాశాలలో ఫీజు రియంబర్స్మెంట్ వసూలు కాక విద్యార్థుల నుండి ఫీజులు వసూలు చేయడం దారుణమని.. అన్నారు.. ప్రభుత్వం వెంటనే స్పందించి విద్యార్థి సమస్యలు పరిష్కరించాలని కోరారు...గత 120 రోజులుగా ఉమ్మడి 4 జిల్లాల పరిధి లోపర్యటించానని.చాలా సమస్యలు తన దృష్టికి వచ్చాయని వారి సమస్యల పరిష్కారానికి ముందుంటునని ముందుంటానని అన్నారు. కేజీ టు పీజీ వరకు అన్ని రంగాలపై అవగాహన ఉన్న తనను రానున్న పట్టభద్రుల ఎన్నికల్లో భారీ మెజారిటీ తో గెలిపించాలని కోరారు... విద్యారంగాన్ని బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని వెల్లడించారు.. విద్యారంగం నుండి వచ్చిన తనకు ఉద్యోగ నిరుద్యోగ పట్టభద్రుల సమస్యలపై పూర్తిస్థాయిలో అవగాహన ఉందని.. నిరుద్యోగ నిర్మూలనకు ఒక ప్రణాళిక బద్ధంగా ముందుకు వెళుతున్నానని వెల్లడించారు...గతంలో గెలిచిన పట్టభద్రుల ఎమ్మెల్సీలు నిరుద్యోగుల సమస్యలు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు... వివిధ ప్రభుత్వ రంగ సంస్థలలో చాలావరకు ఖాళీగా ఉన్నాయని వాటిని భర్తీ చేసేందుకు కృషి చేస్తానని అన్నారు.. గురుకుల,, మోడల్, కేజిబివి లలో పని చేస్తున్న ఉపాధ్యాయులకు హెల్త్ కార్డుల మంజూరుకై కృషి చేస్తానని అన్నారు.. ప్రభుత్వ గురుకులాలలో కీచన్, మెస్,కేర్ టేకర్ సిస్టం నుసఫరెట్ వ్యవస్థ ను ఏర్పాటు చేయాలనిఅన్నారు.. గత 11 రోజులుగా సర్వ శిక్ష అభియాన్ తమ న్యాయమైన డిమాండ్ల కోసం రిలే నిరాహారదీక్షలు చేస్తున్నారని.. త్వరలోనే వారికి ప్రభుత్వం శుభవార్త చెబుతుందని ఆశాభవం వ్యక్తం చేశారు... 317 జీవో ద్వారా ప్రభుత్వ ఉద్యోగులు చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని ప్రభుత్వం వెంటనే వారి స్థానికతను బట్టి సొంత జిల్లాలకు బదిలీ చేయాలని కోరారు.. రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేట్ డిగ్రీ కళాశాల యాజమాన్యాలు ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల కాక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని ప్రభుత్వంతో మాట్లాడి వారి సమస్యను పరిష్కరిస్తానని అన్నారు..