బాధితులకు సత్వర సేవలు అందించాలి జగిత్యాల డిఎస్పీ రఘు చందర్

బాధితులకు సత్వర సేవలు అందించాలి జగిత్యాల డిఎస్పీ రఘు చందర్

బాధితులకు సత్వర సేవలందించాలి
... సీసీ కెమెరాలు పై ప్రత్యేక దృష్టి సారించాలి
...జగిత్యాల డి.ఎస్.పి. రఘు చందర్


రాయికల్, డిసెంబర్ 9,

పోలీస్ స్టేషన్కు వచ్చే బాధితులకు సత్వర సేవలు అందించాలని జగిత్యాల డి.ఎస్.పి. రఘు చందర్ అన్నారు. సోమవారం రాయికల్ పోలీస్ స్టేషన్ ను డి.ఎస్.పి ఆకస్మాత్తుగా తనిఖీ చేశారు. స్టేషన్లోని ఫిర్యాదులు,పెండింగ్ కేసుల ప్రగతిని, నేరాల నమోదు వంటి రికార్డులను పరిశీలించారు.పోలీస్ స్టేషన్ కు వచ్చే ఫిర్యాదు దారులకు సహాయ కేంద్రం వద్ద సిబ్బంది అందుబాటులో ఉండాలని సూచించారు.అనుమతి లేనిది సిబ్బంది రాయికల్ మండలాన్ని విడిచి వెళ్ళరాదని అన్నారు. కూడళ్ల వద్ద గంజాయి, డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిరంతరం నిర్వహించాలని అన్నారు. నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు పనితీరుపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.స్టేషన్ పరిసరాలతో పాటు పోలీస్ సిబ్బంది ఉండే క్వార్టర్స్ పరిశీలించి మౌలిక వసతులు  ఏర్పాటు చేయాలని అన్నారు.ఈ కార్యక్రమంలో జగిత్యాల రూరల్ సీఐ కృష్ణారెడ్డి,   ఎస్సై సుదీర్ రావు,సిబ్బంది పాల్గొన్నారు.IMG-20241209-WA0000

Tags: